SRD: పటాన్ చెరులోని శ్రీనివాస్ నగర్ కాలనీలో GHMC మేయర్ విజయలక్ష్మి మూడు నెలల క్రితమే పార్కును ప్రారంభించినా, ఇంకా అందుబాటులోకి రాకపోవడంపై మాజీ కార్పొరేటర్ టీ. అంజయ్య కురుమ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కార్పొరేటర్ పుష్ప నగేష్ కేవలం పేరు కోసం, ఫోటోల కోసమే పనిచేశారన్నారు. ప్రజా ప్రయోజనాలను విస్మరించారని విమర్శించారు. తక్షణమే దీనిని తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.