ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ దుమ్మురేపుతోంది. మలేసియా జట్టుతో జరిగిన సూపర్-4 దశ రెండో మ్యాచులో భారత్ 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో నెగ్గడం ద్వారా భారత్ తమ ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది. కాగా, సూపర్-4 టేబుల్లో భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రేపు చైనాతో భారత్ చివరి సూపర్-4 మ్యాచ్ ఆడనుంది.