టెస్ట్, T20లకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అయితే వన్డేల్లో కొనసాగాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని ఇద్దరికీ BCCI స్పష్టంచేసినట్లు ఓ అధికారి తెలిపాడు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 24 నుంచి జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని రోహిత్ తెలిపినట్లు సమాచారం. అటు లండన్లో ఉంటున్న కోహ్లీ ఈ టోర్నీ ఆడటంపై అనుమానంగా ఉంది.