»Mawlynnong Is The Cleanest Village In Asia What Are The Characteristics Of This Village
Mawlynnong: ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రమైన గ్రామం మావ్లిన్నోంగ్.. ఈ గ్రామ విశేషాలు, ఏంటంటే?
మావ్లిన్నోంగ్ ఈ గ్రామం పేరు వినే ఉంటారు. దీన్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అంటారు. ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రంగా ఉండే గ్రామం. ఈశాన్య భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక గ్రామం ఇది. డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఎంపిక చేసింది.
Mawlynnong is the cleanest village in Asia. What are the characteristics of this village?
Mawlynnong: మావ్లిన్నోంగ్ ఈ గ్రామం పేరు వినే ఉంటారు. దీన్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అంటారు. ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రంగా ఉండే గ్రామం. ఈశాన్య భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక గ్రామం ఇది. డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఎంపిక చేసింది. షిల్లాంగ్ నుండి 90 కి.మీ దూరంలో భారతదేశం- బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు ఖాసీ తెగకు చెందిన వారు. మావ్లిన్నాంగ్ విలేజ్‌లో 1000 పైగా జనభాతో 100 పైగా ఇల్లులు ఉంటాయి. ఇక్కడి స్థానికులు ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా ఆ గ్రామ అక్షరాస్యత 90 శాతంగా ఉంది.
ఈ గ్రామ ప్రజలది వ్యవసాయ ఆధారిత జీవన విధానం. ఎక్కవగా తమలపాకులు పండిస్తారు. వేసవి కాలంలో పైనాపిల్స్, లీచీలు పండిస్తారు. ఈ గ్రామం నుంచి బయట మార్కెట్లకు కూడా వాటిని ఎగుమతి చేస్తారు. ఈ గ్రామంలో ఎక్కువగా క్రిస్టియన్లు ఉంటారు. అందుకే విలేజ్‌లో మూడు చర్చీలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవే ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థ కాకుండా మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. అంటే తల్లి ఇంటిపేరునే పిల్లలకు ఇస్తారు. తల్లి ఆస్తిని తన చిన్న కూతురుకు ఇచ్చే సాంప్రదాయం ఉంది.
ముఖ్యంగా మావ్లిన్నాంగ్ గ్రామం పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది. ట్రావెల్ మ్యాగజైన్ డిస్కవర్ ఇండియా ఈ గ్రామాన్ని 2003లో ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రకటించింది. దాంతో ఈ గ్రామం పర్యాటక ప్రదేశంగా మారింది. విదేశాల నుంచే కాకుండా మన భారతదేశం నలుమూల నుంచి పర్యటకులు ఈ విలేజ్‌ను సందర్శిస్తున్నారు. ఇక్కడి పరిశుభ్రతను చూసి వావ్ అంటున్నారు. ఇక్కడ అన్ని చిన్న చిన్న హోటల్లే ఉంటాయి. కానీ వారు చాలా హైజినిక్ పాటిస్తారు. 2005 తరువాత 60 శాతం ఈ గ్రామస్తుల ఆదాయం పెరిగింది. ఇక్కడ చెత్తను సేకరించి ఓ గొయ్యిలో వేసి దాన్ని ఎరువుగా మారుస్తారు. గ్రౌండ్ వాటర్ పెంచడానకి ప్రతీ ఇంటి ముందు ఇంకుడు గుంతలు తవ్వుతారు. వర్షపు నీటి నిల్వలను ప్రొత్సహిస్తారు.
ఇక్కడ తమ గ్రామాన్ని శుభ్రం చేసుకోవడానికి చిన్న పెద్ద అందరూ ఒక కమ్యూనిటీలా పాల్గొని ప్రతీ వీధిని శుభ్రం చేస్తారు. ఇక్కడ ధూమపానాన్ని స్వచ్చందంగా నిషేధించారు. ఈ గ్రామంలోని చెత్తను ఎత్తడానికి వెదురుతో తయారు చేసిన ప్రత్యేక బుట్టలను వాడుతారు. ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ వాడకం నిషేధించుకున్నారు. ఈ విలేజ్‌లో చాలా వరకు వెదురును ఉపయోగిస్తారు. వంతెనలు నిర్మించాలన్నా, ఇంటి ముందు ప్రహరీలు కట్టుకోవాలన్నా వాటినే వాడుతారు. ఈ గ్రామంలో అతిథులు నివసించడానకి బ్యాంబో కాటేజీలు స్పెషల్. అవి కూడా టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఇక ఊరంత పచ్చని చెట్లే. ఎక్కడ చూసినా మంచి మంచి మొక్కలు నాటుతారు. ఇంటి ముందు, వీధుల్లో, పార్కుల్లో అంతటా పూలా మొక్కలే దర్శనం ఇస్తాయి. అందుకే ఈ విలేజ్ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం సమతుల్యంగా ఉంటుంది.
ఈ గ్రామంలో ఒక స్కై వ్యూ పాయింట్ అనే ప్రదేశం పర్యటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆకాశ వీక్షణం అనుభూతి చెందాలంటే రూ. 30 చెల్లించాలి. ఒకే సారి పది మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అక్కడ నుంచి మావ్లిన్నోంగ్ గ్రామం మొత్తాన్ని చూడొచ్చు. విలేజ్ ఎంట్రెన్స్‌లో బ్యాలెన్సింగ్ రాక్ అనే ప్రదేశం ఉంటుంది. దాన్ని చూడడానికి రూ. 10 ఇవ్వాలి. గ్రామంలోనికి వాహనాలు ఎంట్రీ ఉండదు. ఈ గ్రామాన్ని సందర్శించాడాని రూ. 50 టికెట్ పెట్టాలి. గ్రామంలోకి ప్రవేశంచడానికి ముందు అక్కడే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడే స్థానికులు స్వయంగా తయారు చేసిన సాంప్రాదాయమైన వస్తువులు ఉంటాయి. అయితే అక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువ. ఉందుకంటే వారే స్వయంగా తయారు చేస్తారు. ముఖ్యంగా వారి జీవనాధారం కూడా అదే.. అందులో ఎక్కువగా విదేశీయులు వస్తారు కాబట్టి వాళ్లకు ఆ ధరలు తక్కువే అనిపిస్తాయి. దీనిపై ప్రభుత్వం ఇంకాస్త దృష్టి పెడితే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు.