»3 8 Magnitude Earthquake Hits Kargil No Deaths Reported
Earthquake: కార్గిల్, మేఘాలయాల్లో భూకంపాలు
దేశంలోని రెండు ప్రాంతాల్లో ఒకే రోజు భూకంపాలు సంభవించాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో ఈరోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
Powerful 7.5-Magnitude Earthquake Strikes Mindanao In Philippines
Earthquake: దేశంలోని రెండు ప్రాంతాల్లో ఒకే రోజు భూకంపాలు సంభవించాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో ఈరోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని చెబుతున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ భూకంపాలతో దద్దరిల్లింది. ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రంలోని తూర్పు గారో హిల్స్‌లో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్ తెలిపింది. మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.