»Asia Record 3 Ipl Teams Find Place Among Top 5 Asian Sports Team On Twitter
Asia Record ట్విటర్ లో నంబర్ వన్ చెన్నై జట్టు.. తర్వాత ఎవరంటే..?
ఆసియా ఖండంలోనే దిగ్గజ జట్లుగా మన దేశానికి చెందిన మూడు జట్లు నిలువడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న చెన్నై అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ప్రపంచంలో క్రికెట్ (Cricket) కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా భారతదేశంలో క్రికెట్ ఆడని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)తో యావత్ ప్రపంచాన్ని భారత్ వైపు క్రికెట్ తిప్పేసింది. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ కొనసాగుతోంది. అయితే టోర్నీలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings- CSK) సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. అటు ఆటలోనూ.. ఇటు సోషల్ మీడియాలోను సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎంతలా అంటే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫుట్ బాల్ జట్లను కూడా తోసిరాజేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore – RCB), ముంబై ఇండియన్స్ (Mumbai Indians- MI) కూడా చరిత్ర సృష్టిస్తున్నాయి.
సోషల్ మీడియాలో (Socia Media) ప్రజాదరణపై ఓ సర్వే జరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో అత్యధికంగా ట్విటర్ (Twitter)లో చర్చించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిలిచింది. 55 లక్షల మంది (5.2 మిలియన్స్) సీఎస్కేపై (Chennai) కామెంట్లు, ట్వీట్లు, రీట్వీట్లు, లైక్ లు వంటివి చేశారు. ఈ కోటాలో ఆసియాలోనే (Asia) చెన్నై తొలిస్థానంలో నిలిచింది. ఆసియాలోనే నంబర్ వన్ జట్టుగా పేరు పొందింది. ఇక రెండో స్థానంలో అల్ నసర్ (Al-Nassr FC) ఫుట్ బాల్ క్లబ్ నిలిచింది. అనంతరం మూడు, నాలుగు స్థానాల్లో మన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు వరుసగా నిలిచాయి. 3.45 మిలియన్స్ తో బెంగళూరు, 2.74 మిలియన్స్ తో ముంబై టాప్ -4లో చోటు దక్కించుకున్నాయి.
ఆసియా ఖండంలోనే దిగ్గజ జట్లుగా మన దేశానికి చెందిన మూడు జట్లు నిలువడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న చెన్నై అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా, ఈసారి చివరి ఐపీఎల్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీకి ఎలాగైన ట్రోఫీతో వీడ్కోలు పలుకాలనే భావనలో సీఎస్కే జట్టు తీవ్రంగా పోరాడుతోంది. నేటి వరకు 8 మ్యాచ్ లు ఆడి ఐదింట గెలిచిన ధోనీ సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి కప్ మనదే నంటూ చెన్నై అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.