»Nagalands Neiphiu Rio And Meghalayas Conrad Sangma Takes Charge
NorthEastern States రెండు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు.. ప్రధాని సహా
మేఘాలయ ముఖ్యమంత్రిగా కన్రాడ్ సంగ్మా (Conrad Sangma) రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో (Neiphiu Rio) సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఈశాన్య రాష్ట్రాల్లో (NorthEastern States) రెండింట కమలం పార్టీ ప్రభుత్వాలను నిలబెట్టుకుంది. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలు కొలువుదీరాయి. త్రిపురలో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మేఘాలయ ముఖ్యమంత్రిగా కన్రాడ్ సంగ్మా (Conrad Sangma) రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో (Neiphiu Rio) సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని కొత్త ప్రభుత్వాలకు శుభకాంక్షలు తెలిపారు.
మేఘాలయ అసెంబ్లీలో 60 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఎన్ పీపీ 26 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఏ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, యూడీపీ వంటి మిత్రపక్షాలతో సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సంగ్మా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి బీజేపీ అగ్ర నాయకులంతా తరలివచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో ఎన్ పీపీకి ఏడు, యూడీపీకి 2, బీజేపీ, హెచ్ఎస్ పీడీపీకి ఒకటి చొప్పున అవకాశం దక్కింది. ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్ 2.0గా నామకరణం చేశారు.
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నెఫ్యూ రియో కూడా ప్రమాణస్వీకారం చేశారు. 60 స్థానాలు మేఘాలయలో ఎన్డీపీపీ, బీజేపీకి కలిపి 37 స్థానాలు వచ్చాయి. దీంతో మరోసారి బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. త్రిపురలో 32 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ, ఐపీఎఫ్ టీ కూటమి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. మాణిక్ సాహా రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. త్రిపుర: మొత్తం 60 సీట్లలో బీజేపీ కూటమి 33 స్థానాలు సొంతం చేసుకుంది. బీజేపీ 32 స్థానాల్లో గెలవగా.. మిత్రపక్షం ఐపీఎఫ్ టీకి ఒక స్థానానికి పరిమితమైంది. ఇక తిప్రా మోథా పార్టీ 13 స్థానాల్లో గెలిచి బీజేపీకి షాకిచ్చింది. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి 14 స్థానాలు (సీపీఎం11, కాంగ్రెస్ 3) సొంతం చేసుకున్నాయి. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్పీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయాయి.
నాగాలాండ్: మొత్తం 60 స్థానాల్లో బీజేపీ కూటమికి 37 స్థానాలు దక్కాయి. ఎన్ డీపీపీ 25 ఎమ్మెల్యేలు, బీజేపీ 12 గెలుచుకున్నాయి. ఎన్ సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) 5, ఎల్ జేపీ 2, ఆర్ పీఐ 2, ఎన్ పీఎఫ్ 2, జేడీయూ 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్ కు ఒక్క సీటు దక్కలేదు.
మేఘాలయ: ఇక్కడి ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇవ్వలేదు. మొత్తం 60 స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా.. 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) 26 సీట్లు సొంతం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 5, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు సొంతం చేసుకుంది. బీజేపీ రెండు సీట్లకు పరిమితమైంది.