సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ.. పలు అంశాలపై తనదైన శైలీలో చమత్కరించే మంత్రికి ఓ వింత అభ్యర్థన ఎదురైంది. తన లవర్‌తో ఫస్ట్ టైమ్ డేట్‌కు వెళ్తున్న ఓ యువకుడు డబ్బులు కావాలని అభ్యర్ధించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
Nagaland minister Temjen Imna Along was a young man who paid money for dating
Viral News: ఏ రాజకీయ నాయకుడికైనా ఊరి సమస్యలు, వీధి సమస్యల గురించి ప్రజలు అభ్యర్థిస్తారు. అయితే నాగాలాండ్(Nagaland) బీజేపీ అధ్యక్షుడు, మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along)కు మాత్రం ఓ వింత అభ్యర్థన ఎదురైంది. ఎప్పుడ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మంత్రి ఆ ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు. దాంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన లవర్‌తో బయటకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం కావాలని ఓ యువకుడు ఏకంగా మంత్రినే అడిగాడు. సార్ అక్టోబర్ 31న తన డ్రీమ్ గర్ల్‌తో మొదటిసారి డేటింగ్‌కు వెళ్తున్నా అని. కాని తన దగ్గర పైసాలు లేవని చెబుతూ.. తనకు చిన్న హెల్ప్ కావాలి ఏదైనా చేయండి అని ఆ వ్యక్తి మంత్రిని అడిగాడు. దానికి మంత్రి..తానను ఏం చేయమంటావో చెప్పండి అని చురుగ్గా సమాధానం ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన సమాధనంతో మంత్రి ఆశ్చర్యపోయారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు సైతం సరదాగా స్పందించారు. కొందరు ఆ యువకుడి స్థానంలో మంత్రి తెమ్జెన్ను డేట్‌కు వెళ్లమన్నారు. మరికొందరు ఆ లవర్ బాయ్‌ను ఎమ్మెల్యే చేయండంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరు ఆశ్చర్యపోయిన సింబల్స్ పెట్టారు. ఎప్పుడు నెట్టింట్లో చమత్కరించే పోస్టులతో అలరించే మంత్రి తెమ్జెన్.. గతంలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌లో తెమ్జెన్ భార్య అంటూ కనిపించిన ఓ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. గూగుల్ తనను ఉత్సాహానికి గురిచేసిందని.. తాను ఇప్పటికీ ఆమె కోసం వెతుకుతున్నానని రాసుకొచ్చారు. ఇది కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టింది.