»Banks Are Closed For Half Of The Days In November
Bank holidays: నవంబర్లో సగం రోజులు బ్యాంకులు మూత..సెలవులుండే రోజులివే
నవంబర్ నెలలో సగం రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు ఉన్నాయి. ఇకపోతే మిగిలిన రోజుల్లో ఏయే సెలవులు ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.
మరో రెండు రోజుల్లో అక్టోబర్ నెల పూర్తికానుంది. ఇకపోతే నవంబర్ నెలలో బ్యాంకులు సగం రోజులు మూతపడనున్నాయి. నవంబర్లో ఏ రోజుల్లో సెలవులు ఉంటాయో ఆర్బీఐ వెల్లడించింది. 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. అందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు ఉంటాయి. అలాగే ప్రాంతీయ, రాష్ట్రాల వారీగా సెలవులు కలుపుకుని తొమ్మిది రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ తెలిపింది. మరి ఆ సెలవులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు:
నవంబర్ 1 : కన్నడ రాజ్యోత్సవం, కుట్, కర్వా చాట్ సందర్భంగా కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 5: ఆదివారం వారాంతపు సెలవు ఉంటుంది.
నవంబర్ 10: వంగ్లాలా పండుగ సందర్భంగా అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, ఇంఫాల్, కాన్ఫూర్, లక్నో నగరాల్లో సెలవు ఉంటుంది.
నవంబర్ 11: రెండో శనివారం సెలవు ఉంటుంది.
నవంబర్ 12: ఆదివారం వారాంతపు సెలవు ఉంటుంది.
నవంబర్ 13, 14: నరక చతుర్థి, దీపావళి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
నవంబర్ 15: లక్ష్మీ పూజ (దీపావళి/నింగోల్ చాకౌబా) సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 19 : ఆదివారం వారాంతపు సెలవు ఉంటుంది.
నవంబర్ 20: ఛాత్ పూజ సందర్భంగా బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 23: సెంగ్ కుట్స్ నెమ్, ఈగాస్ బాగ్వాల్ పండుగల సందర్భంగా ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 25: నాలుగో శనివారం సెలవు ఉంటుంది.
నవంబర్ 26: ఆదివారం వారాంతపు సెలవు ఉంటుంది.
నవంబర్ 27: గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పౌర్ణమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 30: కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు ఉంటుంది.