Bank Holidays : ఈనెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులకు సెలవులు
నేటితో ప్రారంభం అయిన ఏప్రిల్ నెలలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకు సెలవులు వచ్చాయి. కాబట్టి బ్యాంకులతో పనులు ఉన్న వారు ఈ సెలవుల సంగతేంటో తెలుసుకోవాల్సిందే.
Bank Holidays In April 2024 : మన నిత్య జీవితంలో డబ్బులు, బ్యాంకులతో రోజు రోజూ పనులు ఉంటూనే ఉంటాయి. అయితే ఈ ఏప్రిల్ నెలలో మాత్రం ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అంటే దాదాపుగా సగం నెల అవి పని చేయవన్న మాట. కొన్ని రాష్ట్రాల ఆధారంగా వచ్చే సెలవులు కాగా, కొన్ని మాత్రం జాతీయ సెలవులు. కాబట్టి స్థానికంగా ఉండే సెలవుల్ని ఆధారంగా చేసుకుని ఆయా రాష్ట్రాల్లో ఏ రోజున బ్యాంకులు పని చేస్తాయో, ఏ రోజున పని చేయవో గమనించుకోవాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ కార్యకలాపాలను తరచుగా చేసుకునే వారు తదనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. ఏఏ రోజుల్లో బ్యాంకుల సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి. ఇక్కడ స్థానిక పండుగలు ఉన్నచోట సంబంధిత రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవులు(HOLIDAYS) ఉంటాయని గమనించుకోవాలి.