డిసెంబర్ నెలలో 18 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు ఉద్యోగులు కూడా డిసెంబర్ నెలలో 4వ తేది నుంచి 11వ తేది వరకూ సమ్మె చేయనున్నారు. ఈ తరుణంలో సగానికిపైగా రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన సెలవులతో పాటు సమ్మె రోజులు ఏయే తేదీల్లో ఉండనున్నాయో తెలుసుకోండి.
డిసెంబర్ 1 శుక్రవారం: అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం / స్థానిక విశ్వాస దినోత్సవం.
డిసెంబర్ 3 ఆదివారం: దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 3 సోమవారం: సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఫీస్ట్ డే-గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 9 రెండో శనివారం: దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 10 ఆదివారం: దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 12 మంగళవారం: పా-తోగాన్ నెంగ్మింజా సంగ్మా-మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 13 బుధవారం: లోసూంగ్/ నామ్ సూంగ్-సిక్కింలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 14 గురువారం: లోసూంగ్/ నామ్ సూంగ్-సిక్కింలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 17 ఆదివారం: దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 18 సోమవారం: యూ సోసోథామ్ వర్ధంతి -మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 19 మంగళవారం: గోవా విముక్తి దినోత్సవం-గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 23 నాలుగో శనివారం: దేశవ్యాప్తంగా సెలవు.
డిసెంబర్ 24 ఆదివారం: దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 25 సోమవారం: క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 26 మంగళవారం: క్రిస్మస్ సంబురాల సందర్భంగా మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు.
డిసెంబర్ 27 బుధవారం: క్రిస్మస్ సంబురాల సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 30 శనివారం: యూ కియాంగ్ నాంగ్ బాహ్-మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 31 ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
అలాగే బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నియామకాలు చేపట్టాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిసెంబర్ 4 నుంచి 11 వరకు సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది.