»Womens Day Telangana Govt Declared Awards To 27 Womens
Women’s Day 27 మందికి తెలంగాణ మహిళా పురస్కారాలు.. ఒక్కొక్కరికి రూ.లక్ష
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని (Fecilitation) ప్రభుత్వం నిర్ణయించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని (Fecilitation) ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 27 మంది మహిళలను అవార్డుల (Awards)కు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి (Holikeri) ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డు గ్రహీతలకు రూ. లక్ష చొప్పున నగదు పురస్కారంతో పాటు జ్ణాపిక, ప్రశంసాపత్రం అందించనున్నారు.
గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇచ్చోడ మండలం ముఖ్రా కే (Mukhra K Village) సర్పంచ్ మీనాక్షి గాడ్గే (Meenakshi Gadge)కు తెలంగాణ ప్రభుత్వం పురస్కారం ప్రకటించింది. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న మీనాక్షిని మహిళా దినోత్సవం రోజు సత్కరించాలని నిర్ణయించింది. స్వచ్ఛత, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సేవలు, పచ్చదనం ఇలా అన్ని రంగాల్లో ముఖ్రా కే పంచాయతీ అభివృద్ధి సాధించింది. ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపికై ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఈ గ్రామానికి వచ్చాయి. గ్రామం అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ మీనాక్షికి కూడా ఆ అవార్డులు లభిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రపతి చేతులమీదుగా మీనాక్షి అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించారు.
బానోతు జ్యోతి– అంగన్ వాడీ టీచర్ గుండా రాజకుమారి– భరోసా కేంద్రం కో- ఆర్డినేటర్, సుజాత దీక్షిత్ – థియేటర్ స్వరూప పొట్లపల్లి – జర్నలిజం డాక్టర్ బండారు సుజాత శేఖర్ – జానపద సాహిత్యం అరుణ నారదభట్ల – సాహిత్యం డాక్టర్ అమూల్య మల్లన్నగారి – వైద్యారోగ్యం నారా విజయలక్ష్మి (పీహెచ్)– పెయింటింగ్ ఓఎన్ఐ సిస్టర్స్ (వినోద, విజయ, విజయలక్ష్మి)– సంగీతం రుక్మిణి, ఎస్సై– షీటీమ్స్ భరోసా కేంద్రం అనసూయ, ఐపీఎస్, డీసీపీ – పోలీస్ శాఖ అన్వితారెడ్డి – పర్వాతారోహకురాలు త్రిష గొంగడి – క్రీడలు (అండర్-19 క్రికెటర్) డాక్టర్ అనురాధ తడకమళ్ల – శాస్త్రీయ నృత్యం దంటు కనకదుర్గ – సామాజిక కార్యకర్త డాక్టర్ మాలతి – సూపరింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్లబుర్జు సమంతా రెడ్డి – మహిళా సాధికారత కర్నె శంకరమ్మ – కిన్నెర, ఫోక్ డాక్టర్ గూడూరు మనోజ– ఆద్య కళ సామళ్ల శ్వేత – కమ్యూనిటీ మొబిలైజేషన్ జి. నందిని- సూపర్ వైజర్, నిజామాబాద్ (అర్బన్) ప్రాజెక్ట్ రజియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్, కౌడిపల్లి, ఐసీడీఎస్- నర్సాపూర్ ఎం. కృష్ణవేణి – ఆశా కార్యకర్త ఇందిర – ఏఎన్ఎం డాక్టర్ కె. రాణి ప్రసాద్ – సాహిత్యం