ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అట్టుడుకుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించారు.
Narendra Modi: ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అట్టుడుకుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించారు. అసలు ఇదేం భాషని విమర్శించారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన పార్టీ పదేళ్ల కిందట అధికారాన్ని కోల్పోయింది. వాళ్లు ఇప్పుడు ఇలాంటి మాటలు ఆడటం కరెక్టేనా? మీరు వాటిని అంగీకరిస్తారా? అలాంటి భాష ఆమోదయోగ్యమా? అని వాళ్లపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇండియా బ్లాక్ లోకతంత్ర బచావో ర్యాలీలో ప్రసంగించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అంపైర్లను కొని, లేదా ఆటగాళ్లను కొని, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవచ్చు. దీనినే క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మన ఎదుట లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను మోదీ ఎన్నుకొన్నారు. మ్యాచ్‌కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా వాళ్లు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం. ఈ ఫిక్సింగ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి రాజ్యాంగాన్ని మారిస్తే దేశం మొత్తం అట్టుడుకుతుందని బీజేపీపై రాహుల్ విమర్శలు చేశారు.