వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కక్షిదారులు ఈనెల 21న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ సన్రైత్ సింగ్ కోరారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ తగాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇరువర్గాల సమ్మతితో కేసులను పరిష్కరించుకోవాలన్నారు.