ATP: రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న జోన్ 5 టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతపురం జిల్లాలో పార్టీ బలోపేతంపై ఆయనతో ముచ్చటించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.