»Tillu Square Vs Family Star Who Has The Upper Hand
Family Star: టిల్లుగాడు vs ఫ్యామిలీ స్టార్? ఎవరిది పై చేయి?
సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాకపోయినా.. వారం గ్యాప్‌లో వస్తున్నారు కాబట్టి.. ఇద్దరు యంగ్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. ఇప్పటికే సిద్దు జోన్నలగడ్డ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. మరి ఫ్యామిలీ స్టార్ పరిస్థితేంటి?
Tillu Square vs Family Star? Who has the upper hand?
Family Star: నాలుగు రోజుల్లోనే 78 కోట్లు రాబట్టి.. వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు టిల్లుగాడు. సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ ప్రకారం చూస్తే.. ఇవి అంతకుమించిన వసూళ్లనే చెప్పాలి. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టింది. టిల్లుగాడికి ఉన్న క్రేజ్‌కు హిట్ టాక్ రావడంతో.. వంద కోట్లు కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సిద్ధు. ఇక విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రౌడీ హీరోకి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన విజయ్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. గీతా గోవిందం కాంబో రిపీట్ చేస్తు.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు గట్టిగా ఉన్నాయి.
పైగా ప్రమోషన్స్ పీక్స్‌లో చేస్తున్నారు. దీంతో.. ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్‌తో టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్‌కు కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే.. సూపర్ టాక్‌తో టిల్లుగాడు థియేటర్లో ఉండగానే.. వారం గ్యాప్‌లో ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడు. పైగా ఈ సమ్మర్ పెద్ద సినిమాలు కాస్త ఇవే. కాబట్టి.. ఈ యంగ్ హీరోల మధ్య బాక్సాఫీస్ లెక్కల పోటీ తప్పదు. రౌడీ క్రేజ్‌కు దిల్ రాజు బ్రాండ్‌కు ఫ్యామిలీ స్టార్ భారీ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉంది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన.. ఈజీగా వంద కోట్లు కొల్లగొట్టడం గ్యారెంటీ. ఈ సినిమాకు దాదాపు 45 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. మరి ఈ సమ్మర్లో ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.