»Big Announcement From Allu Arjun Pushpa The Rule Everyone Is Interested
Allu Arjun: పుష్ప ది రూల్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్.. అందరిలో ఆసక్తి
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప ది రూల్ నుంచి భారీ అప్డేట్ రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Big announcement from Allu Arjun Pushpa The Rule.. everyone is interested
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వస్తున్న పుష్ప ది రూల్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటి పార్ట్ పాన్ ఇండియా రేంజ్లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపింది. పాన్ ఇండియా మొత్తం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa The Rule). ఇప్పటికే దీని నుంచి పోస్టర్లు, కొన్ని వీడియోలు సైతం విడుదల అయ్యాయి. అయినా బన్ని ఫ్యాన్స్ ఇంకా ఏదో కావాలని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం మైత్రీ మూవీ మేకర్స్ టీం అదిరిపోయే అప్డేట్ అందించడానికి సిద్ధం అయింది. పుష్ప మాస్ జాతర షురూ అంటూ ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు రాబోతుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో ఐకాన్ స్టార్ అభిమానుల్లో సందడి నెలకొంది.
అయితే వీరు ఇవ్వబోతున్న మోస్ట్ ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ ఏంటై ఉంటుందని తెగ చర్చ నడుస్తుంది. ఇంకొన్ని గంటల్లో పుష్పరాజ్ టీం ఏసర్ప్రైజ్ ఇస్తుందో తెలిసిపోతుంది. పుష్ప ది రూల్ షూటింగ్ కోసం వైజాగ్‌లో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ విజువల్స్ నెట్టింట దర్శనం ఇచ్చాయి. లాంగ్ హెయిర్, గడ్డం, బ్లాక్ గాగుల్స్‌తో కనిపించాడు. ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో తెలియాాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రష్మిక మందన్నా శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ రోల్లో కనిపించనుంది. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.