పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు తెరపడింది. 15 రోజుల పాటు వాడివేడిగా సాగిన ఈ సమావేశాలను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సెషన్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులు, పథకాలకు సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రజాపద్దులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సభ్యుల సహకారానికి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.