స్టార్ హీరోల వెకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు.. విదేశాల్లో వాలిపోతుంటారు మన్ స్టార్ హీరోలు. ప్రస్తుతం ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్. మరి ఎవరెవరు ఎక్కడున్నారు?
Prabhas: మామూలుగా స్టార్ హీరోలంతా సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా మహేష్ బాబు సమ్మర్లో ఫుల్ చిల్ అవుతుంటాడు. సినిమా షూటింగ్ ఉన్న సరే.. షూటింగ్ గ్యాప్‌లో ఫారిన్ చెక్కేస్తుంటాడు. ఇప్పుడు కూడా చిల్ మోడ్‌లోనే ఉన్నాడు మహేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. ఓ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా మహేష్ బాబు షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదిరిపోయేలా ఉన్నాడు మహేష్. దీంతో.. #MaheshBabu ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలాగే.. #SSMB29 ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే.. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.