»Kalki Who Targeted Baahubali Is This The New Release Date
Prabhas: బాహుబలిని టార్గెట్ చేసిన కల్కి? కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన బాహుబలి మూవీ సెట్ చేసిన రికార్డులను అందుకోవాలంటే.. మళ్లీ ప్రభాస్ లేదా రాజమౌళి వల్లే అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా బాహుబలిని టార్గెట్ చేసినట్టుగా చెబుతున్నారు.
Kalki who targeted Baahubali? Is this the new release date?
Prabhas: ప్రభాస్, రాజమౌళి నుంచి కొత్త సినిమాలు వస్తున్నాయంటే.. ఖచ్చితంగా కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. కానీ బాహుబలి రికార్డ్స్‌ను మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. అయితే.. నెక్స్ట్ మహేష్ బాబుతో రాజమౌళి చేయనున్న సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డులను బద్దలు చేసేలా ఉంది. కానీ అంతకంటే ముందే.. బాహుబలి రికార్డ్స్‌ను టార్గెట్ చేస్తూ కల్కి సినిమా వస్తోంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ ప్రముఖులు ఇచ్చే హైప్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. హాలీవుడ్ రేంజ్లో సరిగ్గా ప్రమోట్ చేస్తే.. 500 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. బాహుబలి రికార్డ్స్ డేంజర్ జోన్లో పడినట్టే. అయితే.. రికార్డులు, కలెక్షన్స్ మాత్రమే కాదు.. ఇప్పుడు బాహుబలి రిలీజ్ డేట్‌ను కూడా కల్కి టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మే 9న కల్కి రిలీజ్‌కు షెడ్యూల్ చేసి పెట్టారు మేకర్స్. కానీ.. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
దీంతో కల్కి వాయిదా పడినట్టేనని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ వాయిదాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే.. బాహుబలి 1 రిలీజైన రోజు జులై 10న కల్కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే.. జులై 10వ తేదీ బుధవారం అవుతోంది. అయినా కూడా.. ఆ వారంలోనే కల్కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.. అనేది లేటెస్ట్ టాక్. అయితే.. కల్కి కూడా రెండు భాగాలుగా వస్తుందనే టాక్ ఉంది. కాబట్టి.. బాహుబలి1 సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ.. కల్కి పార్ట్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుందని సమాచారం. మరి కల్కి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.