వాయు కాలుష్యం, దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో 152 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్ట్కు వచ్చేముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 14 కేంద్రాల్లో AQI 400 దాటగా.. ఆర్కే పురంలో అత్యధికంగా 447 నమోదైంది. జనం ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు.