Is Pawan Alliance Plan Is Workout Or Not
Pawan Kalyan: ఏపీలో రాజకీయం…ఊహించినంత సింపుల్‌గా అయితే లేదు. బాబు అరెస్ట్ తర్వాత… ఎన్నికల హీట్ మరింత పెరిగిందనే మెసేజ్… జనాల్లోకి బలంగా వెళ్లింది. అసలు బాబు అరెస్ట్ విషయం..ఢిల్లీ పెద్దలకు ముందే తెలుసా? పొత్తు ప్రకటన విషయంలో తొందరెందుకు పడ్డారు ? రెండు పార్టీలను వెంటాడిన భయాలేంటి ? నిజంగా పొత్తులతో జగన్‌కు మైనస్సేనా? ఈ టైమ్‌లో ముందస్తుకు వెళ్తే జగన్‌కు ప్లస్ అవుతుందా ? బాబుని ఇరుకున పెట్టేందుకు.. వైసీపీ ఇంకే ప్లాన్స్ వేస్తోంది ? 2024 ఎవరికి ఫేవర్ అవ్వబోతోంది ? లెట్స్ వాచ్ ఇన్ దిస్ స్పెషల్ స్టోరీ…. ?
చదవండి: Old Parliament చరిత్ర.. అమల్లోకి వచ్చిన చట్టాలు ఇవే
పవన్ సాహసం
ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. నిన్నటి దాకా చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తిరిగిన రాజకీయం ఒక్కసారిగా పొత్తుల మీదకు మళ్ళింది. ములాఖత్‌లో చంద్రబాబును కలిసిన తర్వాత పొత్తులపై కీలక ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). మాజీ సీఎంని ఆకాశానికెత్తేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు. ఒక రకంగా ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. రెండు పార్టీల మధ్య పొత్తు గురించి చాలా రోజులుగా ప్రచారం ఉన్నా…అందరూ ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రకటిస్తారేమోలే అని అనుకున్నారు…! మాండ్‌తో మానసికంగా దెబ్బతిన్న బాబులో… కాస్తంత ధైర్యాన్ని నింపేందుకు..ఒకింత సాహసం చేసారనే చెప్పాలి. ఎందుకంటే… రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర…పొత్తు ప్రకటన చేయడమంటే మామూలు విషయం కాదు.
ఇప్పుడు కాదు.. కానీ
వాస్తవానికి కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయం అనుకుంటున్నా… ఆ పొత్తును ఇప్పటికిప్పుడు ప్రకటించే అవకాశం ఉండదని భావించారు అంతా. చంద్రబాబు అరెస్టుతో పరిస్థితులు, పరిణామాలు మారిపోయాయి. ఇంత హఠాత్తుగా ప్రకటన రావడానికి కారణాలు చాలానే ఉన్నాయన్న చర్చ…ఇటు టీడీపీ, అటు జనసేన వర్గాల్లో ఓ రేంజ్లో జరిగింది. పొత్తు పొడవడానికి ఇంకా చాలా టైమే ఉన్నా…అరెస్ట్ వల్లే చాలా తొందరగా ప్రకటించేశారు. ఈలోగా బీజేపీ విషయంలో కూడా క్లారిటీ తీసుకోవాలని.. ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలనేది టీడీపీ-జనసేన అభిప్రాయమని చెప్పొచ్చు.
మారిన రాజకీయం
చంద్రబాబు (chandrababu) రిమాండ్ తర్వాత.. సీన్ మారిపోయింది. అసలు చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీకి ముందస్తు సమాచారం ఉందనేది టీడీపీలోని మెజార్టీ నేతల అభిప్రాయమట. ఈ డౌట్ చాలా మందికి ఉన్నా.. ఎవ్వరూ బయటపడలేదనే అనుమానాలు మొదట్నుంచీ ఉన్నాయి. సీనియర్ నేత అయ్యన్న మాత్రం… ఉగ్గబట్టుకోలేక, ఇంకా లాభం లేదులే అని రెస్పాండ్ అయ్యారు. బీజేపీ పెద్దలు బాబు అరెస్ట్ మీద ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దీనికి తగ్గట్టే ఢిల్లీతో పాటు ఏపీ బీజేపీ నేతలు కూడా మాట్లాడలేదు. ఇదంతా చూస్తుంటే… అరెస్ట్ విషయాన్ని బీజేపీ పెద్దలకు వైసీపీ హింట్ ఇచ్చిందనేది… చాలా మంది తెలుగు తమ్ముళ్లకు వచ్చిన డౌట్. ఈ పరిణామాలను గమనించిన తర్వాత ఇక లేట్ చేయడం ఎందుకని..దూకుడుగా వెళ్లాలనే భావనతోనే.. జనసేన-టీడీపీ నిశితంగా ఆలోచించి కలిసి వెళ్లాలనే భావనతోనే ఇలాంటి ప్రకటన చేసాయనే చెప్పుకోవచ్చు.
ఇబ్బంది అవుతుందని
ఇంకా ఆలస్యం అయితే… రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళనతోనే పొత్తులపై క్లారిటీ ఇచ్చేసినట్టు విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పవన్ కళ్యాణ్ రాజమండ్రి రావడం.. చంద్రబాబుతో ములాఖత్ కావడం.. పొత్తులపై ప్రకటన చేయడం, ఆ సందర్భంలో ఓవైపు లోకేష్.. మరోవైపు బాలకృష్ణ ఉండేలా ప్లాన్ చేసుకోవడమంతా అందులో భాగమేనంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయం బీజేపీ పెద్దలకు తెలిసి జరిగింది కాదని స్వయంగా పవన్ చెప్పడంతో పాటు.. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. తానింకా ఎన్డీఏలో ఉన్నాననే విషయాన్ని స్పష్టంగా చెప్పారు పవన్. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ పాత్రపై టీడీపీకి అనుమానాలు ఉండడంతో.. కమలం పార్టీపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ-జనసేన పొత్తుల ప్రకటన చేశాయనేది మరో వెర్షన్. ఈ పరిస్థితుల్లో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాత్రం బాబు అరెస్ట్ చుట్టూ తాము లేమని…అరెస్ట్‌పై ముందు స్పందించిందే బీజేపీనని కరాకండీగా చెప్పేసారు. ఇటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా… సీఎం జగన్ తీరును… తప్పు పట్టడం కాస్తంత ఆసక్తిగా మారింది.
బయటకు ఎలా తేవాలి..?
చంద్రబాబు అరెస్ట్, తర్వాత రిమాండ్… అదీ అక్రమ అరెస్టా… లేక సక్రమ అరెస్టా అని మాట్లాడుకోవడం కంటే… బాబుని బయటకు తీసుకొచ్చేందుకు…బయటున్న వాళ్ల దగ్గరున్న అస్త్రాలేంటి? ఒకవేళ రిమాండ్ అయిపోయాక… మళ్లీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే… అటు పార్టీ, ఇటు మిత్రపక్షాల పరిస్థితేంటి..?
ఎలా బయటపడాలి
స్కిల్ డెవలప్మెంట్ కేసులో.. చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో… ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయ్. ఇప్పటివరకు 2024 ఎలక్షన్స్‌కు ఎలా ముందుకెళ్లాలా అన్న ఆలోచనలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు…. బాబు అరెస్ట్ తర్వాత…ఆ కేసు నుంచి ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబుతో వరుస ములాఖత్‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్. పవన్, బాలయ్య, లోకేశ్… జైల్లో ఉన్న చంద్రబాబుని ములాఖత్ టైమ్‌లో కలిసి… అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలపై కాసేపు మాట్లాడుకున్నారు. ఎందుకంటే…బాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి మైలేజ్ బాగా పెరిగిపోయింది. టీడీపీ అధినేతది అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ వర్గాలు వారిస్తుంటే… అదేం కాదంటూ…రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మరీ కొట్టిపారేస్తుంది అధికార వైసీపీ.
అన్నీ తాను అయిన బాలయ్య
ఎందుకంటే…. జైలులో ఉన్న చంద్రబాబు వందకి వంద శాతం ఖాళీగా అయితే ఉండరు. ఎలా బయటకు రావాలా అని వ్యూహాలు రచిస్తూనే ఉంటారు. దీనికి తోడు బయటున్న బావమరిది బాలకృష్ణ, కొడుకు నారా లోకేశ్ కూడా… ఏదో ఒక ప్లాన్స్ అయితే వేస్తూనే ఉంటారు. వాస్తవానికి…. చంద్రబాబుని బయటకు తీసుకురావడం… అనుకున్నంత చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే ఆయన ప్రమేయం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పడలేదు. ఎందుకంటే… కేబినెట్‌కి లీడర్‌గా, అప్పటి సీఎంగా చంద్రబాబే వ్యవహరించారు. ఒకవేళ స్కామ్ ప్రూవ్ అయితే… ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో కూడా చెప్పలేం. ఇలాంటి సందర్భంలో… బాబును బయటకు తీసుకురావడం చాలా పెద్ద టాస్క్. ఇప్పటికే పార్టీ పగ్గాలు తీసుకుని… యాక్టివ్ అయిన బాలయ్యకు బాబును బయటకు తీసుకురావాలని ఎంతో తాపత్రయ పడుతున్నారు. అరెస్ట్ అయిన రోజు రాత్రే… కుటుంబ సభ్యులతో కలిసి…దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అరెస్ట్‌ను నిరసిస్తూ.. టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడం, దానికి సంబంధించిన వ్యవహారాలను…. టీడీపీ హెడ్డాఫీస్ నుంచి రివ్యూ చేయడం లాంటి పనుల్లో.. తనని తాను ప్రూవ్ చేసుకున్నారాయన.
లోకేశ్ అరెస్ట్
మరోవైపు లోకేష్‌ని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో… బాలయ్య లీడ్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. పరామర్శ యాత్రను ప్రకటించడంతోపాటు.. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసానిస్తున్నారు. దీంతో ఒకవేళ చంద్రబాబు, లోకేష్ అందుబాటులో లేకుంటే… ఇక టీడీపీ వ్యవహారాలను తానే చూసుకుంటాను… డోంట్‌వర్రీ అంటూ.. తెలుగు తమ్ముళ్లలో భరోసానిస్తున్నారు. అటు పవన్ కూడా టీడీపీకి, చంద్రబాబుకి మొదట్నుంచీ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మధ్యలో కొన్ని పరిణామాల నేపథ్యంలో…. పార్టీ కార్యక్రమాలను వ్యతిరేకించినా….చంద్రబాబుని ఎప్పుడూ తప్పుబట్టలేదు. మరి అలాంటి వ్యక్తి…. జైలు నుంచి చంద్రబాబుని తీసుకురావడానికి ఏం సహాయం చేస్తారో వేచి చూడాల్సిందే.
నోరుమెదపని తారక్
ఇంత జరుగుతున్నా…ఇంత చిన్న రియాక్షన్ కూడా లేదెందుకు ? చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదెందుకు ? బాబు బాగా బిజీనా…లేదా మనకెందుకెలే అని లైట్ తీసుకున్నారా..? బాబుని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నోరు మెదపలేదు ?
అంతా వెళ్లగా..
ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఏం జరిగినా సరే… పెద్ద చర్చే జరుగుతుంది. నారా, నందమూరి కుటుంబాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే గొడవ. ఈ క్రమంలో.. బాబు ఎపిసోడ్లో తారక్ ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు… పొలిటికల్ సర్కిల్స్‌లో… గత వారం నుంచి హాట్ టాపిక్‌గా మారాయి. ఒక విధంగా చెప్పాలంటే.. అరెస్ట్ అయినప్పటి బాబు కుటుంబం మొత్తం.. రోడ్డు మీదే ఉంది. నంద్యాలలో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ తరలించి, తర్వాత రాజమండ్రి జైలుకు పంపేదాకా తీవ్రమైన హైడ్రామా నడిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ టైంలో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణికి సంఘీభావంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళారు. బాలకృష్ణ, రామకృష్ణతోపాటు మరికొంతమంది హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో విజయవాడ వెళ్ళి బాసటగా నిలబడ్డారు.
జూనియర్ బిజీ
ఎంత.. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా.. మేనత్తని ఇచ్చిన మామ కోసం ఒక చిన్న రియాక్షన్ అయినా ఇవ్వరా అని…ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పైగా అరెస్ట్ అయినప్పుడు.. సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్‌లో జరుగుతోంది. నేరుగా వెళ్ళగలిగేంత దూరంలో ఉన్నా.. వెళ్ళలేదు సరి కదా… కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు పార్టీ లీడర్లు. అంటే.. ఆ ఫ్యామిలీ నుంచి మానసికంగా తారక్ దూరమైనట్టేనా? లేక అనవసరమైన రాజకీయ వివాదాలు ఎందుకనుకుంటున్నారా అన్న సందేహాలు…కేడర్‌లో వస్తున్నాయట. ఇప్పుడేం కొత్త కాకపోయినా…. గతంలో కూడా చాలా సందర్భాల్లో తారక్ తీరు ఇలాగే ఉంది.
దూరం దూరం..
ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతోంది..? అసలు కుటుంబ కార్యక్రమాల్లో… తారక్ అంటీ ముట్టనట్టుగా.. ఎందుకు ఉంటున్నారనేది… నిజంగా ఎవరికీ అర్దం కాని ప్రశ్న. అటు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న… చర్చ ప్రకారం .. పొలిటికల్‌గా బాబుకు, టీడీపీకి ఉపయోగపడే… ఏ కార్యక్రమానికైనా వెళ్లకూడదని జూనియర్ డిసైడయ్యారట. 2009 ఎన్నికల తర్వాత టీడీపీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తారక్. అదే సందర్బంలో చంద్రబాబుతో కలిసి డయాస్ షేర్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువే. ఇక హరికృష్ణ చనిపోయిన తర్వాత పార్టీకి జూనియర్‌తోపాటు, మామా అల్లుళ్ళకు మధ్య కూడా గ్యాప్ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. రాజకీయంగా ఇబ్బంది ఉండదు అనుకున్న కార్యక్రమాలకు మాత్రం చంద్రబాబు వస్తున్నా ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నట్టు తెలిసింది. ఆ మధ్య తన అక్క సుహాసిని ఇంట్లో జరిగిన పెళ్ళికి వెళ్ళారు జూనియర్. అదే కార్యక్రమానికి చంద్రబాబు ఫ్యామిలీ కూడా వెళ్ళింది. అయినా ఇద్దరి మధ్య మాటల్లేవని, వ్యవహారం మొత్తం అంటీ ముట్టనట్టుగానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
చదవండి: Glass Symbol : జనసేన పార్టీకే గాజు సింబల్.. సీఈసీకి కృతజ్ఞత తెలిపిన పవన్
తేడా వస్తే అంతే సంగతులు
జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ లెక్కలేంటి ? పొత్తులపై సీట్ల పంపకాల విషయంలో ఎవరి లెక్కలు వాళ్లేసుకుంటున్నారు. అసలు నిజంగా సీట్ల పంపకం సరిగ్గా జరిగితే…ఇబ్బంది లేదు కానీ.. ఏమైనా మనస్పర్ధలు వస్తే మాత్రం… వైసీపీ లాభ పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మైనస్ అవుతుందా..?
పవన్ చరిష్మా టీడీపీకి చాలా లాభపడిందని చెప్పడంలో.. ఏమాత్రం సందేహం లేదు. బీజేపీ కూడా పొత్తులో ఉండటంతో… రెండు పార్టీల మధ్యే… సీట్ల పంపకాలు జరిగాయ్. వచ్చే ఎన్నికల్లో పొత్తుల ప్రకటన కంటే ముందు నుంచే… పవన్ వారాహి ద్వారా.. పార్టీ ఇమేజ్ అమాంతం పెంచేసారు. పొత్తుల విషయం ఎన్నికల సమయంలో చూసుకుందామని చెప్పుకుంటూ వచ్చిన పవన్… ఎట్టకేలకు పొత్తులపై కుండబద్దలు కొట్టారు….ఇప్పుడు వైసీపీకి మైనస్ అవ్వడం పక్కా. ఎందుకంటే… గత ఎన్నికల్లో 40కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు గెలిచిన మెజార్టీతో పోలిస్తే… అక్కడ జనసేనకు వచ్చిన ఓట్ల సంఖ్యే ఎక్కువ. ఈ లెక్కన చూసుకుంటే… ఎలా వెళ్లినా వైసీపీకి ఈసారి దెబ్బ పడుతుందనే ఊహాగానాలకు కొదువే లేదు. ఇలాంటి సమయంలో… జగన్ ముందస్తుకు వెళ్తే… వైసీపీకే ప్రయోజనమనే చెప్పాలి.
సీట్ల లెక్కలు తేలాలి..?
జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది అని తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. పొత్తుల ప్రకటనకు ముందు వరకూ టీడీపీలో ఉన్న పరిస్థితి.. ఆ తర్వాత మారిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే టీడీపీలో ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జీల నియామకం జరగలేదు. ఇప్పుడిప్పుడే ఇబ్బందికరంగా ఉన్న స్థానాలకు… ఇంచార్జీలను ఎంపిక చేస్తూ… బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారు బాబు. వచ్చే దసరా నాటికి మేనిఫెస్టో విడుదలతో పాటు… మొదటి విడత అభ్యర్ధులను ప్రకటించాలి అనుకున్నారు. ఇంతలో ఇలా జరగడంతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో ఉన్నారన్నది కాదనలేని నిజం.
సీట్ల లెక్కలు ఇలా..?
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వల్ల… ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ఎక్కడెక్కడ జనసేనతో సీట్ల సర్ధుబాటు ఉంటుందని… టీడీపీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జిల్లాల వారీగా గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా గెలుపోటములను శాసించే స్థాయిలో జనసేన పార్టీ ఉంది. దీంతో నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలతో పాటు వైసీపీ అభ్యర్ధుల మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా సీట్లను అంచనా వేసుకుంటున్నారు పార్టీ నేతలు. చంద్రబాబు అరెస్ట్ కు ముందు వరకూ రెండు పార్టీలు కలిస్తే జనసేనకు గరిష్టంగా 25 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరిగింది. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం పార్టీకి పవన్ మద్దుతు తప్పనిసరి కావడంతో ఈసారి ఎక్కువగానే సీట్లను ఆశిస్తారనే చర్చ జరుగుతుంది. అయినప్పటికీ గెలిచే స్థానాల్లో ఎక్కువ సీట్లు ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 40 సీట్ల వరకూ జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తుండటం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
కలిసి వచ్చేనా..?
అలా చూస్తే చాలా స్థానాల్లో టీడీపీకి మంచి మెజార్టీ వచ్చిందని చెప్పుకొస్తున్నారు. దీంతో ఈసారి కలిసి పోటీ చేయడం ద్వారా చాలా స్థానాల్లో టీడీపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. టీడీపీ బలహీనంగా ఉన్న స్థానాల్లో జనసేనకు సీటు ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు కూడా అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు జనసేనకు ఇచ్చేలా టీడీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి పొత్తుల ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీతోపాటు జనసేనలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటికే టిక్కెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న స్థానాల్లో అభ్యర్ధులు తారుమారయితే స్థానికంగా ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా లెక్కలు వేస్తున్నారు. రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీ వేసిన తర్వాత సీట్లు, అభ్యర్ధుల విషయంలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.