»Allocate Time With The Children Or Antonys Situation May Come
Childrenతో టైమ్ కేటాయించండి, లేదంటే ఆంటోనీ పరిస్థితి రావొచ్చు..?
నటుడు విజయ్ ఆంటోనీ కూతురు తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఒత్తిడికి గురై.. చివరకు తనువు చాలించింది. ఆమె మృతితో మరోసారి పిల్లలపై ఒత్తిడి చర్చకు వచ్చింది. పేరంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి..? ఎంత సమయం కేటాయించాలనే విషయంపై మానసిక వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేశారు.
Allocate Time With The Children, Or Antony's Situation May Come..?
Time To Children: హీరో విజయ్ ఆంటోనీ (Antony) కూతురు సూసైడ్ పిల్లలపై ఉన్న ఒత్తిడి, మానసిక ఆందోళనను తెలియజేసింది. పిల్లలకు ఫ్రెషర్ ఇవ్వొద్దని అప్పట్లో విజయ్ నీతి సూక్తులు వల్లించారు. తనవరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఈ కాలంలో పిల్లలపై ప్రెషర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. చదువు, ఆటలు, కొందరికీ పాటలు, డ్యాన్స్ అని రకరకాల పేర్లతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. అందులో కొందరు తీసుకోవడం లేదు. చిన్న వయస్సులో.. ఇక జీవితం చాలు అనుకుంటున్నారు. ఓ బలహీన క్షణంలో సూసైడ్ చేసుకుంటున్నారు. పసిమొగ్గల ఆకాల మరణానికి కారకులెవరు..? ఇందులో పేరంట్స్ తప్పేంత..? నిందించే సమాజానికి బాధ్యత లేదా..? ఈ ప్రశ్నలు సగటు జీవిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఆంటోనీ కూతురు ఇలా..
విజయ్ ఆంటోనీ కూతురు ఇంటర్ చదువుతోంది. చదువు విషయంలో ఆమె ఒత్తిడికి గురైంది. తన గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. తర్వాత మిగతా వారిని మేల్కొలిపింది. అవును.. పిల్లలు ఎందుకు ఇలా ఒత్తిడికి గురవుతున్నారు..? వారితో పేరంట్స్ సమయం ఇవ్వడం లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజమే.. ఏ తల్లిదండ్రి కూడా పిల్లలతో రోజు గంట కూడా గడపడం లేదనే కఠోర నిజం తెలిసింది. మోడ్రన్ లైఫ్ స్టైల్, వర్క్ నేపథ్యంలో టైమ్ ఇవ్వడం లేదు. రోజు ఏదో కారణం చెప్పి.. ఎస్కేప్ అవుతున్నారు. దీంతో పసి మనస్సుల్లో పేరంట్స్పై నమ్మకం ఉండటం లేదు. తాము ఒంటరి వారమని బెంగ పడుతున్నారు. మరికొందరు మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. పేరంట్స్ అంటే భయం, సమాజం పట్ల బాధ్యతతో ఉన్న కొందరు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
సమయం కేటాయించాలి
పిల్లలకు మంచి స్కూల్లో సీటు, డ్రెస్సులు, పుస్తకాలు, ఆట బొమ్మలు, చివరికీ డబ్బులు ఇస్తే సరిపోదు. వారితో తల్లిదండ్రులు విధిగా సమయం కేటాయించాలి. అప్పుడు మీ పిల్లల గురించి మీకు తెలుస్తోంది. మానసిక పరిస్థితి ఎలా ఉంది. ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది. వారు ఏదైనా అంటే భయపడుతున్నారా..? అనే విషయం తెలుస్తోంది. సంతోషాలు ఏంటీ..? ఏమిస్తే వారు హ్యాపీగా ఉంటారో తెలుస్తోంది. పిల్లలు ఆనందంగా ఉంటే ఏ సమస్య ఉండదు. వారి కోసం సమయం కేటాయిస్తే.. ఇష్టఇష్టాలు.. అభిరుచులు తెలుస్తాయి. దాంతో నెక్ట్స్ వారికి ఇష్టమైన వస్తువులు, ఫుడ్ ఇస్తే ఎగిరి గంతేస్తారు. ఇలా చేస్తే.. వారిలో ఆత్మన్యూనత భావం ఏర్పడదని.. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగు వేస్తారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే అర్ధాంతరంగా జీవితాన్ని చాలిస్తారని హెచ్చరిస్తున్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే.. అలాంటి వాతావరణం ఉంటే.. తమ వెంట తల్లిదండ్రులు ఉన్నారనే ధైర్యం ఉంటుంది. లేదంటే ఒంటరి అనే భావనలో ఉంటారని మరీ మరీ చెబుతున్నారు.
కంపేర్ చేయొద్దు
పిల్లలను ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేయొద్దు. చదువంటే యుద్ధం అన్నట్టు ప్రవర్తించొద్దు. ఫస్ట్ ర్యాంక్ రావాలని.. వారిపై రుద్దొద్దని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో కలిసి ఉండటం ఇంపార్టెంట్.. పోటీ తత్వం ఉండేలా చేయాలి. అలా చేస్తే వారు ఒత్తిడికి గురవ్వరు. ఏదో చదవాలి.. మార్కుల రావాలి అన్నట్టు ప్రవర్తిస్తే చివరికీ పేరంట్స్కు శోకం తప్పదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. కొందరు పిల్లలు చక్కగా చదువుతున్నారు.. వారు మరింత మార్కులు వచ్చేందుకు ఒత్తిడి చేస్తున్నారు కొందరు పేరంట్స్.. దీంతో పిల్లలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పేరంట్స్ తప్ప బంధాలు, బంధుత్వాలు తెలియడం లేదు. దీంతో కూడా మంచి, చెడు చెప్పేవారు లేకుండా అయిపోయారు. పిల్లల కోసం అమ్మ, నాన్న సంపాదిస్తున్నారు.. కానీ వారికి టైమ్ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సమస్యలు వస్తున్నాయి. సమయం కేటాయిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే విజయ్ ఆంటోనికి వచ్చిన పరిస్థితి రావొచ్చు.
క్షణికావేశంలో
పెళ్లైన తర్వాత పేరంట్స్కు పిల్లలే లోకం.. వారి చదువు, జాబ్, లైఫ్, పెళ్లి అంటూ.. అప్పుడే వారి లైఫ్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. వారి కోసం డబ్బులు పక్కన పెడుతుంటారు. అనుకున్న సమయం మాత్రం ఇవ్వరు. దీంతో కొందరు క్షణికావేశంలో డిసిషన్ తీసుకుంటారు. తర్వాత.. చేసేదేమీ ఉండదు. ఆస్తులు, అంతస్తులు, బంగాళ, కార్లు ఉంటాయి.. కానీ పిల్లలు మాత్రం ఉండరు. వారి లేని జీవితం ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. ఇకనైనా పేరంట్స్ మీ పిల్లలకు తగిన సమయం కేటాయించి, వారి బంగారు భవితకు బాటలు వేయండి. లేదంటే చేతులారా లైఫ్ నాశనం చేసుకునే సిచుయేషన్ వస్తోంది.