»Air Pollution Second Biggest Reason For Deaths In South Asia
Air Pollution : వాయు కాలుష్యం కారణంగా 21 లక్షల మంది మృతి.. వారిలో 1,69,400 మంది పిల్లలు
ప్రపంచంలోని 10 వాయు కాలుష్య దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతదేశంలోని 83 నగరాల్లో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే అధ్వాన్నంగా ఉందని ‘IQAIR’ నివేదిక పేర్కొంది.
Air Pollution : ప్రపంచంలోని 10 వాయు కాలుష్య దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతదేశంలోని 83 నగరాల్లో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే అధ్వాన్నంగా ఉందని ‘IQAIR’ నివేదిక పేర్కొంది. ఇప్పుడు మరో నివేదిక భారతీయులను ఆందోళనకు గురి చేసింది. బుధవారం విడుదల చేసిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ ప్రకారం.. 2021లో వాయు కాలుష్యానికి సంబంధించిన వ్యాధుల కారణంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1.6 లక్షల మంది పిల్లలు మరణించారు.
2021లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా 80 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. వీటిలో భారత్లో 21 లక్షల మంది, చైనాలో 23 లక్షల మంది మరణించారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఆధారంగా అంచనాల ప్రకారం.. దక్షిణ ఆసియాలో ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వాయు కాలుష్య సంబంధిత మరణాల రేటు 100,000కి 164గా ఉంది, ప్రపంచ సగటు 100,000కి 108గా ఉంది.
2021లో వాయు కాలుష్యం భారతీయ పిల్లలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంది. 2021లో బాలల మరణాలలో భారతదేశంలో 169,400, నైజీరియాలో 114,100, పాకిస్తాన్, ఇథియోపియాలో 31,100, బంగ్లాదేశ్లో 19,100 మరణాలు ఉన్నాయి. వాయుకాలుష్యం ప్రభావం పిల్లలపై ఎక్కువగా కనిపిస్తోందని నివేదికలో పేర్కొంది. పిల్లలు వాయు కాలుష్యం వల్ల కలిగే వ్యాధులకు లోనవుతారు. వాయు కాలుష్యం వల్ల కలిగే హాని గర్భంలోనే ప్రారంభమవుతుంది. ఆరోగ్యంపై వీరి ప్రభావం జీవితాంతం ఉంటుంది.
పిల్లలలో గాలి కలుషిత వ్యాధుల సంకేతాలు
పిల్లలలో కనిపించే కాలుష్య-సంబంధిత ఆరోగ్య ప్రభావాలలో నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు ఉండవచ్చు. 2021లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 2,60,600 మంది పిల్లలు వాయు కాలుష్యానికి గురికావడం వల్ల మరణించారు.పోషకాహార లోపం తర్వాత దక్షిణాసియాలో ఈ వయస్సు వారికి మరణానికి ఇది రెండవ అతిపెద్ద కారణం.