ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అంచనాతో నూతన సచివాలయం నిర్మాణం చేసిందని, ఆ భవణానికి బాబా సాహేబ్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేశారన్నారు. కేసీఆర్ పుట్టిన రోజున ఆ సచివాలయం ప్రారంభించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ(BRS)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) అన్నారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. వారు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ కేఏ పాల్(KA Paul) అన్నారు. అలాగే ఆ నాయకులు తనను ఎందుకు కలిశారనే విషయం ఏప్రిల్ 14వ తేదిన తెలుస్తుందన్నారు. అంబేద్కర్ జయంతి రోజు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలల్లో 15 శాతం వరకూ నిజాయతీపరులు, నైతికత కలిగిన వారు ఉన్నారని, రాబోవు ఎన్నికల్లో కేసీఆర్(KCR)ను ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో బడుగు, బలహీన వర్గాల చేతుల్లోనే అధికారం ఉంటుందని, ప్రజలు మంచి నాయకుడినే ఎన్నుకుంటారని అన్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నారని, తాను కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులతో మాట్లాడ్డంపై నిఘా ఉంచారని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో తానే సీఎం కావాలని 70 శాతం మంది కోరుకుంటున్నారని అన్నారు. ఇదే టైంలో ప్రధాని మోదీపై కేఏ పాల్(KA Paul) విమర్శలు చేశారు. మోదీ, అదానీ ఇద్దరూ కలిసి దేశం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సర్కార్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అంచనాతో నూతన సచివాలయం నిర్మాణం చేసిందని, ఆ భవణానికి బాబా సాహేబ్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేశారన్నారు. తెలంగాణ ప్రజల పన్నులతో నిర్మించిన దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. కేఏ పాల్(KA Paul) ఫిర్యాదు మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి, సుప్రీం కోర్టు ద్వారా ప్రారంభోత్సవాన్ని ఆపివేశారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వ విద్యాలయం విద్యార్థులు యూనివర్సిటీ ఆర్చ్ వద్ద కేఏ పాల్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ గెలుపు బాబా సాహేబ్ అంబేద్కర్ వాదుల విజయంగా విద్యార్థులు పేర్కొంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రమేష్, సురేష్, అజయ్, విలాస్, రాజు, సతీష్, రవిందర్, సంజు, కల్యాణ్, ఉపేందర్, మల్లేష్, రామరాజులు పాల్గొన్నారు.