అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఇసుక దందాకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న క్రమంలో లోకేష్ అక్రమ ఇసుక ఉన్న చోట సెల్ఫీ చిత్రం దిగి నిరసన వ్యక్తం చేశారు.
దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నేత, CLP నాయకుడు భట్టి విక్రమార్క(Bhatti vikramarka) ప్రజావాణి పాదయాత్రలో నిన్న ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పాదయాత్రలో భాగంగా దేవరకొండ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడుకున్నారు. ఆ క్రమంలో నాయకుల తీరుపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్, రవి నాయక్ వర్గాల మధ్య వర్గ పోరు జరిగినట్లు తెలిసింది. ద...
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.
ఎండలకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వీడటం లేదు.. మరి విద్యార్థుల గురించి ఆలోచించరా అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. జూన్ 12వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించామని చెబుతున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారా అనే ప్రశ్న వస్తోంది.
హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన బీజీపీ నేత ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీ అగ్ర నేతలతో ఈటల సమావేశం ఈటలకు బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం రేపు లేదా ఎల్లుండి కొత్త పోస్ట్ ప్రకటించే ఛాన్స్
బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ అంటుండగా.. ఆయనకు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి తోడయ్యారు.
ఇంచార్జీలు కలిసి రావడం లేదా..? అని మీడియా ప్రతినిధి విజయవాడి ఎంపీ కేశినేని నానిని ప్రశ్నించగా భగ్గుమన్నారు. ఇంచార్జీ అనేది రాజ్యాంగ బద్ద పదవీ కాదన్నారు. సామంత రాజు, రాజులు , రారాజులు ఎవరూ ఇక్కడ లేరన్నారు. ఇంచార్జీలు ఎవరు గొట్టంగాళ్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.