Mudragada Padmanabham: వైసీపీలోకి కాపు నేత ముద్రగడ..?
కాపు నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించామని చెబుతున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారా అనే ప్రశ్న వస్తోంది.
Mudragada Padmanabham: కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham). కాపుల రిజర్వేషన్ల కోసం ఇదివరకు కదం తొక్కారు. తుని రైలుకు నిప్పు పెట్టిన ఘటన తర్వాత దూరంగా ఉన్నారు. ఇటీవల రైల్వే కేసు కొట్టివేయగా.. జగన్ సర్కార్ ముద్రగడపై ఉన్న కేసులను కొట్టివేసింది. దీంతో ఆయనను వైసీపీలోకి ఆహ్వానిస్తారా అనే చర్చ జరుగుతోంది. కాపు ముఖ్య నేతలు ఈ రోజు ముద్రగడను (Mudragada) ఆయన నివాసంలో కలిశారు.
ముద్రగడ నివాసానికి వైసీపీ కాపు నేతలు
కిర్లంపూడిలో గల ముద్రగడ నివాసానికి వైసీపీ కాపు నేతలు వంగా గీత (vanga geetha), ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు (chanti babu), వైసీపీకి చెందిన ఎంపీపీలు, కాపు నేతలు వెళ్లారు. అల్పహార విందు చేసి.. రాజకీయాలు మాట్లాడారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. పార్టీలోకి రావాలని వైసీపీ కాపు నేతలు ముద్రగడను (Mudragada) కోరినట్టు విశ్వసనీయ సమాచారం. ఏపీలో కాపుల ఓట్లు ఎక్కువే. కాపు (kapu) సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత తమతో ఉంటే మేలు జరుగుతుందని అధికార పార్టీ భావిస్తోంది. అందుకోసమే తమ ప్రతినిధులను పంపించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ముద్రగడ దూరం
చంద్రబాబు (chandrababu) హయాంలోనే తుని ఘటన జరిగింది. ఆ తర్వాత ముద్రగడను (Mudragada) అప్పటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. దాంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కేసులను ఎత్తివేసిన వైసీపీ ప్రభుత్వం.. తమ పార్టీలోకి రావాలని కోరుతుంది. బీసీలకు నిధులు, ఇళ్లను నిర్మించామని చెబుతోంది. ఒకవేళ ముద్రగడ వైసీపీలోకి చేరేందుకు అంగీకరిస్తే మాత్రం.. జగన్ పార్టీకి బూస్టింగ్ అవుతుంది.
వైసీపీలో చేరతారా..?
వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. వీరితో టీడీపీ కూడా జత కడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే వీరి పని.. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) చాలా సందర్బాల్లో చెప్పారు. సో.. కాపు నేతలను అట్రాక్ట్ చేసే పనిలో వైసీపీ ఉంది. అందుకే ముద్రగడతో (mudragada) సంప్రదింపులు జరిపిందనే వార్త గుప్పుమంది. మరి దీనిపై ముద్రగడ (mudragada)..లేదంటే వైసీపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.