జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.
జబర్దస్త్ షో(Jabardasth Show)లో సీనియర్ కమెడియన్‌గా ఉన్న పంచ్ ప్రసాద్(Punch Prasad) అనారోగ్య సమస్యల(Health Problems)తో ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్య(kidney Problem)తో బాధపడుతున్నారు. రెగ్యులర్‌గా ఆయన డయాలసిస్(dialosis) చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవలె ఆయనకు చాలా సీరియస్ అయ్యింది. డాక్టర్లు కచ్చితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్(Kidney Transplantation) చేయాలని తెలిపారు.
ఏపీ సీఎంవో ఆఫీసర్ చేసిన ట్వీట్:
My team is following up with the family and guiding them in LOC application process. We will LOC under CMRF for renal transplantation as soon as we complete the documents verification.#YSJaganCareshttps://t.co/CAkeihv0VR
కిడ్నీ మార్పిడి(Kidney Transplantation) అంటే భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే ప్రసాద్(Punch Prasad) కుటుంబం ఇప్పుడు ఆర్థిక సాయం చేసేవారి కోసం చూస్తోంది. ఈమధ్యనే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయెల్(Jabardasth Emmanuel) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచ్ ప్రసాద్‌కి సాయం చేయాలని నెటిజన్లను కోరుతూ బ్యాంకు వివరాలు, ఫోటోను షేర్ చేశారు. ఆ పోస్టును ఓ నెటిజన్ ఆంధ్రప్రదేశ్ సీఎంవో అధికారికి కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఆ పోస్టుకు ఏపీ సీఎంవో రిప్లై ఇచ్చింది.
ఇప్పటికే పంచ్ ప్రసాద్(Punch Prasad) కుటుంబ సభ్యులతో సీఎంవో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. పంచ్ ప్రసాద్ కుటుంబీకుల చేత లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. అది అప్లై అవ్వగానే డాక్యుమెంట్లను పరిశీలించి సర్జరీ చేసేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ఏపీ సీఎం(Ap CMO)వో వెల్లడించింది. జగన్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి రోజా(Minister Roja) గతంలో జబర్దస్త్ జడ్డిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె చొరవ తీసుకుని ఆ ప్రక్రియను పూర్తి చేసి ప్రసాద్ కు ఆపరేషన్ జరిగేలా చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.