ఏ పార్టీలో చేరతామనే అంశంపై జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇవ్వడం లేదు. వరసగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. నిన్న మల్లు రవిని కలువగా.. ఈ రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మీట్ అయ్యారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఏపీ మంత్రి రోజా కాలినొప్పి, వాపు సమస్యలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ ను మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాపీ కొట్టారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టగా వేయించుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.