Jupally Krishna Rao: సీనియర్ నేత జూపలి కృష్ణారావు (Jupally Krishna Rao) ఏ పార్టీలో చేరతారనే అంశంపై క్లారిటీ రావడం లేదు. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూ్ 15వ తేదీ వరకు స్పష్టత వస్తోందని ప్రకటించారు. జూపల్లి, పొంగులేటి.. ఏ పార్టీలోకి వెళతారనే అంశంపై క్లారిటీ రాలేదు. ఇంతలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో జూపల్లి భేటీ అయ్యారు. ఆ తర్వాత కొల్లాపూర్ నేత జగదీశ్వర్ రావుతో కూడా సమావేశం అయ్యారు. దీంతో జూపల్లి తిరిగి సొంతగూటికి వస్తున్నారా అనే ప్రశ్న వస్తోంది. వీరిద్దరీతో జూపల్లి వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కావడం.. జూపల్లి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేయడంతో.. కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ విడిచి వెళ్లిన వారు రావాలని కోరారు. తిరిగి వస్తే అంతే ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం హస్తం తీర్థం పుచ్చుకున్నట్టు అవుతోంది. ఆయన ఖమ్మంలో బలమైన నేత.. బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఉన్నారు. కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధులు పొంగులేటితో చర్చలు జరిపారు. తన వర్గానికి 10 టికెట్లు కావాలని పట్టుబట్టడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగింది. తర్వాత ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. బీజేపీలోకి రావాలని కోరారు.. కానీ ఆ చర్చలు సక్సెస్ కాలేదు.
ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తమతో కలిసి ఈటల రాజేందర్ వస్తారని అన్నారు. అంటే ఏ పార్టీ అని చెప్పలేదు.. తమతో కలిసి పోరాటం చేస్తారని.. తమ శత్రువు బీఆర్ఎస్ అంటున్నారు. సో.. వీరు చేరే పార్టీపై స్పష్టత లేదు. మరొవైపు ఈటలకు (etala) బీజేపీలో కీలక పదవీ వరించింది.. బండి సంజయ్‌ను కూడా మారుస్తారట.. అలా అయితే.. పొంగులేటి, జూపల్లి.. బీజేపీలో చేరినా చేరొచ్చని ఆనలిస్టులు అంటున్నారు.