Jaggareddy will not win but will become CM: Harish Rao
Minister Harish Rao: ఏపీ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఆ రాష్ట్రానికి చెందిన నేతల మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని విమర్శించారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. తర్వాత మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ నేతలు చేసిన కామెంట్ల గురించి ప్రస్తావించారు.
ఆనాడు ‘తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తోందని దెప్పి పొడిచారు. శాంతి భద్రతలు క్షీణిస్తాయి.. ప్రతీ రోజు కర్ప్యూ ఉంటుందని చెప్పారు. తెలంగాణ వారికి పరిపాలన చేత కాదు.. విద్యుత్ సమస్య తీరదు. చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి అని’ రకరకాలుగా హేళన చేశారని మంత్రి హరీశ్ రావు (Harish Rao) గుర్తుచేశారు. మరీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో చూడాలని కోరారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారిందని చెప్పారు. ఏపీ పాలకుల తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ వెల్లకిలా పడిందని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఇండైరెక్టుగా సీఎం జగన్ పేరును ప్రస్తావించారు. అలాగే చంద్రబాబు గురించి సెటైర్లు వేశారు. ఒకాయన ఉంటాడు.. అప్పట్లో హైటెక్ సిటీ నిర్మించానని అంటాడు అని విమర్శించారు. గొప్పలు చెప్పుకుంటారు తప్ప.. వారు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి తెలియాలంటే ఏపీ వెళితే అర్థమవుతోంది అంటున్నారు.
తెలంగాణ ఏర్పడకముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే.. నేడు అవీ 70 శాతానికి చేరాయని హరీశ్ రావు (Harish Rao) గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని.. తెలంగాణలో 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు సాధించుకున్నామని తెలిపారు. ఎంబీబీఎస్ సీట్లు కూడా పెరిగాయని వివరించారు. 21 కాలేజీలు తామే ఇచ్చామని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ ఒక్కో కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు.