Allotment of tickets based on survey and performance: Revanth Reddy
Revanth Reddy: తెలంగాణ గట్టు మీద ఎన్నికలు సమయం దగ్గర పడుతోంది. జనాలను ఆకట్టుకోవడంలో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తన దూకుడిని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా జనాల్లోకి వెళుతోంది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికలు/ టికెట్ల గురించి ప్రస్తావించారు.
ఏఐసీసీ సెక్రటరీలు బోసురాజు, నదీమ్ జావిద్‌ను అభినందస్తూ గాంధీభవన్‌లో సభ ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) తోపాటు తెంలగాణ ఇంచార్జీ థాక్రే కూడా మాట్లాడారు. కలిసి కట్టుగా పనిచేయాలని, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని థాక్రే అన్నారు. గట్టిగా పనిచేయాలని.. అధికారం తమదేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పనితనం ఆధారంగానే టికెట్ల ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తేల్చిచెప్పారు. దీనికి సర్వే అంశం ప్రామాణికంగా నిలుస్తోందని వివరించారు. పార్టీకి విధేయుడై ఉన్న వారిని తప్పకుండా గుర్తించి, టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమాతో ఉన్నారు.
ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ ఇంచార్జీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 రోజులకు ఓ నివేదిక పంపించాలని కోరారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని చెప్పారు. అందరూ కష్టపడి పనిచేయాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పక్కా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వివరించారు.