కేసీఆర్ హైదరాబాద్లో భూ దోపిడీకి పాల్పడి లక్ష కోట్ల దోచుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు పార్థసారధి రెడ్డికి భూమి ఇవ్వడంతోపాటు తన అనుచరులకు అనేక మందికి ఇలాగే ఇచ్చారని పేర్కొన్నారు.
వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార వైసీపీ పార్టీ నేతలు దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
పొంగులేటి ప్రజా శాంతి పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రిని చేస్తా కేఏ పాల్(KA Paul) క్రేజీ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఖమ్మం జిల్లాను 10 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేద్దామని వెల్లడించారు.
తమ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై చేసిన పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తనను, తన సన్నిహితులను ప్రశ్నించేవారి నోరు మూయించేందుకు మరోమారు రౌడీ మూకలను జగన్ ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
పట్టుదల, కృషితో ముందుకుపోయి దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను కూడా సమాన స్థాయికి తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. తాగు, కరెంట్, సాగునీటి సమస్యలను 9 ఏళ్లలో అధికమించామన్నారు. పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని, ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు.
కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP)ల మధ్య పొత్తు ఉంటుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో శనివారం సాయంత్రం అమిత్ షా, జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
అవినాష్(Avinash Reddy)కు షరతులతో కూడి బెయిల్‌ను ధర్మాసనం ఇచ్చింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు ఆయన కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఇక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి బీఆర్ ఎస్(BRS) శత విధాలా కృషి చేస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన పార్టీ నేతలను అసమ్మతి రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల మాట పక్కన పెట్టి స్వపక్షనేతలే కొట్టుకు చావడం ప్రధానంగా బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతుంది. రాష్ట్రంలో ఆధిపత్య పోరుతో గులాబీ బాస్ సంతృప్తి చెందడం లేదు.
Telangana:ప్రజల సొమ్మును తమకు కావాల్సిన వారికి పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. తెలంగాణ ప్రజలను అవమానించిన, తెలంగాణ ఉద్యమంపై ఎన్నో కుట్రలు పన్నిన, ఎందరో ఉద్యమకారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆంధ్రా మీడియాకు తెలంగాణ సర్కార్ మరోసారి వందల కోట్లు పంచిపెట్టింది.