తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీఎంగా కేసీఆరే (CM KCR) ఎన్నిక అవుతారని జోస్యం చెప్పారు.ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసున్నారు కేటీఆర్. పని చేసే ప్రభుత్వాలను ప్రజలు కచ్చితంగా వదులుకోరని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కోనే వాళ్ళు ఉంటేనే రియల్ ఎస్టేట్ వాళ్ళు కడుతరు కదా ? ఒక రంగం తో మరో రంగం ముడిపడి ఉందన్నారు. ఈ దేశానికి బువ్వ పెడుతున్న నాలుగు అయిదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేటీఆర్ అన్నారు.తెలివైన వాళ్లు ఎవరూ జేబులో ఉన్న వంద రూపాయలు కిందపడేసి చిల్లర నాణెలు ఏరుకోరు. పని చేసే గవర్నమెంట్ (Goverment) ని ప్రజలు వదులుకుంటారు అని నేను అనుకోను అని ఆయన అన్నారు.
ఐటీ రంగం(IT sector)లో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రం వచ్చిన తొలినాళ్ల కంటే ఇప్పుడు మెరుగైన ప్రగతి సాధించామని, ఐటీ ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు భారీగా పెరిగాయని.. వరంగల్(Warangal), కరీంనగర్ లాంటి సిటీలతో పాటు కొన్ని పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. అమెరికా(America)కు చెందిన క్వాల్కామ్, గ్రిడ్ డైనమిక్స్ సంస్థ సహా అనేక కంపెనీలు హైదరాబాద్(Hyderabad)లో పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన అన్నారు. నగరంలో పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ బాష్ ముందుకొచ్చిందని, గూగుల్ (Google) కూడా ఇక్కడ అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోందన్నారు.