»Manushi Chhillars Green Maxi Dress Gives Holiday Dressing A Fresh Spin
Manushi Chhillar: గ్రీన్ కలర్ మ్యాక్సీ డ్రెస్ లో మెరిసిన మానుషి..!
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మానుషి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. ఎక్కడకు వెళ్లినా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సైతం అద్భుతంగా మెరిసింది.
అక్షయ్ కుమార్(Akshay Kumar)తో కలిసి సామ్రాట్ పృథ్వీరాజ్(Samrat prudviraj)లో బాలీవుడ్(Bollywood)లోకి ప్రవేశించినప్పటి నుండి ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సంవత్సరం నటికి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆమె తన మొదటి కేన్స్‌లోకి ప్రవేశించింది. తొలిసారిగా కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచింది. 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Canns Film Festival)లో పాల్గొన్న మానుషి చిల్లర్(Manushi Chhillar) బ్యాక్ లెస్ గౌనులో మెరిసింది. ఆ డ్రెస్ లో బ్యాక్ ఫోజలతో అదగరొట్టింది. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.
తాజాగా మానుషి చిల్లర్(Manushi Chhillar) గ్రీన్ కలర్ మ్యాక్సీ డ్రెస్ లో మెరిసింది. గ్రీన్ కలర్ రఫుల్డ్ గౌనులో చాలా అందంగా కనిపించింది. ట్రెండీ సన్ గ్లాసెస్, బోల్డ్ కలర్ లిప్ స్టిక్ వేసుకొని, మినిమమ్ మేకప్ తో ఆకట్టుకుంది. ఆమె లుక్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సమ్మర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే డ్రెస్ కావడం విశేషం.
ఇదిలా ఉండగా, మానుషి(Manushi Chhillar) త్వరలోనే టాలీవుడ్ లోనూ మెరవనుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండివధారి అర్జున’ అనే చిత్రంలో నటిస్తున్న వరుణ్.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణంలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో వరుణ్(Varun) సరసన మానుషి నటించనుంది. వాయుసేనలో ఎదురయ్యే సవాళ్లను చూపించబోయే యాక్షన్ సినిమాలో వరుణ్ తేజ్ ఫైలట్‌గా కనిపిస్తాడు. హీరోయిన్ మానుషి రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించనుంది.