5 Lakh Crore Debt But No Change The People's Life: Revanth Reddy
Revanth Reddy: గత 9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని.. అయినప్పటికీ ప్రజల జీవితంలో ఎలాంటి మార్పు లేదన్నారు. న్యూజెర్సీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ (Revanth) పాల్గొన్నారు. 9 ఏళ్లలో బడ్జెట్ ద్వారా రూ.17 లక్సల కోట్లు వచ్చాయని.. చేసిన అప్పు రూ.5 లక్షల కోట్లు అని వివరించారు. రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు.
అమెరికాలో ఉన్న తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది తమ పార్టీయేనని తెలిపారు. అన్నివర్గాల పోరాటం, త్యాగంతో రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబం (kcr family) గత పదేళ్లుగా అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతోందని చెప్పారు. వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నేరవెర్చిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని రేవంత్ (Revanth) అన్నారు.