రూ.లక్ష నోటు(Rs.1 Lakh Note)ను ముద్రించడం భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీస్ పాలనకు ప్రత్యామ్నాయంగా భారత సర్కార్ ఏర్పడటం సాధ్యమనే నమ్మకం బలంగా ఏర్పడింది. అప్పట్లో ఈ రూ.లక్ష నోటుకు ప్రపంచంలోని 10 దేశాల నుంచి మద్దతు లభించింది.
కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతాడన్నారు. చంద్రబాబుకు ఒర్జినాల్టీ లేదని, పర్సనాల్టీ లేదని, క్యారెక్టర్ లేదని విమర్శించారు.
వరంగల్ కాంగ్రెస్ కార్తకర్తల్లో అంతర్గత విభేదాలు చెలరేగాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం చేస్తుండగా గొడవ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్వితీయ విజయంలో సునీల్ కానుగోలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో కేబినెట్ మంత్రి హోదాతో సీఎం సిద్ధరామయ్యకు ముఖ్య సలహాదారుగా కానుగోలు ఎంపికయ్యారు.
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండె సంబంధిత శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి కోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో మెమో దాఖలు చేసింది.
ఏపీ ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి నేడు వారితో భేటీ కానున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. స్థానిక పరిస్థితులను బట్టి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలంగాణపై విషం చిమ్మిన వ్యక్తి.. రూపాయి ఇవ్వనని చెప్పిన మనిషి ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చేస్తానని చెప్పారు. అసెంబ్లీ వేదికగా ‘తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేస్కుంటావో చేస్కో పో’ అన్న వ్యక్తి ఇప్పుడు పార్టీ ఆదేశిస్తే తెలంగాణలో పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఎవరితోనైనా కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే. నా శ్వాస, నా ఊపిరి అన్ని బెజవాడ పార్లమెంట్ కోసమే ఉంటుంది
తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాడు జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు రాహుల్ కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బయటకు వెళ్తుండగా.. వెళ్తా అన్న అని కవిత చెప్పగా.. ‘సరే అక్క.. మళ్లీ కలుస్తా’ అని బండి సంజయ్ అనడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు కవితను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే సంజయ్ అనూహ్యంగా కవితను ఆప్యాయంగా పలుకరించడం గమనార్హం.