Sujana Chowdary: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమీకరణాలు మారుతున్నాయి. నెక్ట్స్ ఏ ప్రభుత్వం అధికారం చేపడుతుంది..? తమకు ఏ పదవీ లభిస్తోందనే లెక్కల మీద నేతల అడుగులు వేస్తున్నారు. ఏపీకి చెందిన కీలక నేత, పారిశ్రామిక వేత్త సుజనా చౌదరీ (Sujana Chowdary) పార్టీ మారతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన టీడీపీలో చేరతారట.. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేస్తారని విశ్వసనీయ సమాచారం.
మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
ఇటీవలే సుజనా చౌదరికీ (Sujana Chowdary) చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు అయ్యింది. పరిశీలనలో భాగంగా అయ్యిందా..? లేదంటే సుజనా చౌదరీ (Sujana Chowdary) టీడీపీకి దగ్గర అవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో 2014-19 వరకు టీడీపీలో సుజనా చౌదరీ (Sujana Chowdary) కీ రోల్ పోషించారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి పదవీ కూడా చేపట్టారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన గుంటూరుపై ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆ సమయంలో గల్లా జయదేవ్ (Galla jaydev) ఎంపీగా ఉన్నారు.
హ్యాట్రిక్ కొడతాడు.. కానీ నో
ఇప్పుడు కూడా గల్లానే (Galla) ఎంపీగా ఉన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గల్లా సుముఖంగా లేరు. ఒకవేళ పోటీ చేసి గెలిస్తే వరసగా మూడోసారి ఎంపీ అయి హ్యాట్రిక్ కొడతారు. గతంలో ఎన్జీ రంగా కూడా గుంటూరు (guntur) నుంచి మూడుసార్లు విజయం సాధించారు. జయదేవ్ (Galla jaydev) మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తన కంపెనీ అమరరాజా ఇష్యూ కావడం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. గుంటూరు నుంచి బరిలోకి దిగనని జయదేవ్ (Galla jaydev) ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాత్రం చెప్పలేదు.
టీడీపీలో చేరి.. గుంటూరు నుంచి పోటీ
ఇదీ సుజనా చౌదరీకి (Sujana Chowdary) కలిసి వస్తోంది. ఆయన బీజేపీని వీడి టీడీపీలో చేరతారట. తర్వాత గుంటూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని తెలిసింది. అందుకోసమే ఇటీవల అలపాటి ఇంట్లో కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబును కలిశారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికీ సుజనా చౌదరి బీజేపీలో ఉన్నారు. సుజనా చౌదరీ చంద్రబాబు ఏజెంట్ అని అధికార వైసీపీ ఆరోపిస్తోంది.