Jawahar Reddy: సీఎస్ జవహర్ రెడ్డి భేటీ కానున్న ఏపీ ఉద్యోగ సంఘాలు
ఏపీ ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి నేడు వారితో భేటీ కానున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
నేడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి(Ap Cs Jawahar Reddy)తో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సీఎస్ క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగులు ఆయనతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల సమస్యల(Employees Problems) పరిష్కారం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎస్ తమను ఆహ్వానించినట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) వెల్లడించారు. ఏపీ జేఏసీ తరపున తాను ఆ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 13న సీఎస్‌కి 50 పేజీల మెమోరాండం ఇచ్చామని, అందులోని అంశాలను చర్చంచేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనను ఆహ్వానించారని బొప్పరాజు(Bopparaju Venkateswarlu) తెలిపారు. గత 84 రోజులుగా ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తున్నారని, ఉద్యమాన్ని చులకనగా చూసే వారిని హెచ్చరిస్తున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యోగుల ఉద్యమం ఆగదని తెలిపారు.
గుంటూరు(Guntur)లో జూన్ 8వ తేదిన ఏపీజేఏసీ(Apjac) అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను బొప్పరాజు(Bopparaju Venkateswarlu) ఆవిష్కరిస్తూ ఉద్యమం చేసే ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవో(GO’s)లను తెచ్చిందని, ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదన్నారు.