ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు(Paper Leak case)లో మరికొంత మంది అభ్యర్థులపై టీఎస్పీఎస్సీ(TSPSC) వేటు వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 13 మంది అభ్యర్థులను శాశ్వతంగా డీబార్(Debar) చేస్తూ ప్రకటించింది. వీరంతా భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు కూడా హాజరు కాకుండా కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే వీరికి ఏ ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చర్యలు తీసుకుంది.
టీఎస్పీఎస్సీ(TSPSC) కార్యదర్శి అనితారామచంద్రన్ ఈ మేరకు బుధవారం ఓ జాబితాను రూపొందించి విడుదల చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు(Paper Leak case)లో భాగాస్వాములుగా ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డీబార్(Debar) చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 13 మందిని డీబార్ చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీబార్ అయిన వారి సంఖ్య 50కి చేరుకుంది.