తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. స్థానిక పరిస్థితులను బట్టి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
25 To 30 BRS Mla: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ టికెట్ల గురించి ఫోకస్ చేసింది. నియోజకవర్గం, ఎమ్మెల్యే.. అందుబాటులో ఉన్నారా..? తదితర అంశాలపై అధినేత కేసీఆర్ (KCR) మంతనాలు జరుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఇస్తానని తొలుత ప్రకటించారు. కానీ పరిస్థితి బట్టి పునరాలోచన చేస్తున్నారు.
కారణం ఇదే..?
బీఆర్ఎస్ పార్టీ (BRS) వరసగా మూడో పర్యాయం బరిలోకి దిగుతోంది. విజయం పక్కా అని అంటోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులను బట్టి కొందరు సిట్టింగులకు హ్యాండ్ ఇవ్వాలని డిసైడయ్యిందని సమాచారం. 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నాలుగింట ఒకవంతు మందికి టికెట్ లభించే అవకాశం లేదు.
సమస్యలివే..?
రుణ మాఫీ, డబుల్ బెడ్ రూమ్, ధరణి పోర్టల్ సమస్య, పెండింగ్ బిల్లులు, ఉద్యోగాల కల్పన గురించి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ అంశాలను కొందరు ఎమ్మెల్యేల వద్ద చెప్పారు. అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని హై కమాండ్ అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేల టికెట్లకు సంబంధించి అధినేత కేసీఆర్ (KCR) స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఇప్పుడే చెబితే వ్యకిరేకత వస్తుందని ఆగుతున్నారని తెలిసింది.
ఈ జిల్లాల్లో..?
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కష్టం అని తెలుస్తోంది. మెదక్ (medak), వరంగల్లో (warangal) ఇద్దరు ఎమ్మెల్యేలు.. నిజామాబాద్ (nizamabad), ఆదిలాబాద్ (adilabad), రంగారెడ్డి (ranga reddy), మహబూబ్ నగర్ (mahabub nagar), ఉమ్మడి ఖమ్మం (kammam) జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే టికెట్ కోల్పోయే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, అందుబాటులో లేకపోవడం.. ప్రభుత్వ పథకాలను చెరవేయకపోవడం తదితర అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు. ఇందులో కొందరు తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. దానిపై కూడా సీఎం కేసీఆర్ (cm kcr) స్పష్టమైన హామీ ఇవ్వలేదు.