సమావేశంలో పరస్పరం కార్యకర్తలు దాడి చేసుకున్నారు. ఒకరిపై నొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చొక్కాలు చించుకున్నారు. మరింత శ్రుతిమించి చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరింది.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతిలో దేశంలోని అన్నీ వ్యవస్థలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ ఆ దేవుడిని కూడా మాయ చేస్తారని సెటైర్లు వేశారు.
బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దానిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సొంతపార్టీలో మండిపడుతున్న వారు కొందరు అయితే... ఇప్పుడు నేరుగా ట్విట్టర్ లోనే విమర్శలు మొదలయ్యాయి.
సుబ్బారెడ్డి వెనుక అధికార పార్టీ ఉందని తెలుస్తోంది. ఈ కారణంగా అతడికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆమెపై పోలీసులు కక్షపూరితంగా.. దౌర్జన్యానికి దిగారని చర్చ కొనసాగుతోంది.
ఎంఐఎంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ముకాసే అలవాటు ఎంఐఎం(MIM)కు ఉంది. బండి సంజయ్ మాట్లాడుతూ.. ముస్లింల(Muslims) జీవితాలను నాశనం చేస్తున్న పార్టీ ఎంఐఎం.. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్నారు.
అసలు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు రెజ్లర్లపై నోరు మెదిపేందుకు జంకుతున్నారు. ఇదే విషయాన్ని ఓ కేంద్ర మంత్రిని మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పరుగు పెట్టారు. ఎక్కడ ఆగకుండా పరుగు పరుగున తన కారు వద్దకు వెళ్లారు.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్న సమయంలో, కేసీఆర్(CM KCR) ఈ సరికొత్త రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు(TDP chief leader Chandrababu Naidu) పేరిట ఉన్నది.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు(K Chandrasekhar Rao) తమ పార్టీ భారత రాష్ట్ర సమితి(BRS)ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల(assembly elections)ను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ఇక్కడ మార్గాలను అన్వేషిస్తోంది.
ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేశారు.. కానీ ఇప్పుడు అదే పార్టీ ఇంటికి మూడు పథకాలు అందిచే స్థాయికి ఎదిగిందని తెలిపారు. కార్యకర్తలు చిందించిన స్వేధం చెరువుల్లో కనిపిస్తున్న నీటి చుక్కలు. మీ త్యాగమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటికుండలాగా తరతరాలను ఆదుకునే ప్రాజెక్టు అని పేర్కొన్నారు.