40 medical colleges lose recognition for non-compliance with NMC standards, 100 more under lens
40 medical colleges: దేశంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని మెడికల్ కాలేజీలపై (medical colleges )ఉక్కుపాదం మోపింది. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 40 వైద్య కళాశాలలు (40 medical college) గుర్తింపును కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, పంజాబ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లోని మరో 100 వైద్య కళాశాలలు కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కోనున్నట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి.
మెడికల్ కాలేజీలలో కమిషన్‌కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ తనిఖీలను గత నెల రోజులుగా నిర్వహించింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీను పరిశీలించారు. ఆధార్ లింక్ అయిన బయోమెట్రిక్, ఫ్యాకల్టీ రోల్స్ తదితర అంశాలను పరిశీలించారు. చాలా కాలేజీల్లో అధ్యాపకుల (staff) కొరత ఉన్న విషయాన్ని గుర్తించారు.
చదవండి: Rajini ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా నో యూజ్: సోదరుడు కామెంట్స్
లైసెన్స్ రద్దుపై మెడికల్ కాలేజీలు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. 30 రోజుల వ్యవధిలో మెడికల్ కమిషన్‌కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కాలేజీ యాజమాన్యం చేసుకున్న అప్పీల్‌కు మెడికల్ కమిషన్ తిరస్కరిస్తే… కేంద్ర వైద్య శాఖను సంప్రదించవచ్చు. ప్రస్తుతం దేశంలో 660 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఎయిమ్స్‌కు చెందిన కాలేజీలు 22 ఉన్నాయి. 150 కాలేజీల గుర్తింపు రద్దు అయితే దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 25 శాతం తగ్గిపోనుంది.