Chiru: మంచి ఆఫర్లు అన్నీ మిస్ చేసుకుంటున్న మెగాస్టార్..?
మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాను మిస్ చేసుకున్నారని తెలిసింది. జైలర్ మూవీ ఆఫర్ చిరుకు రాగా.. పాటలు లేవని ఆలోచించారట. ఇంతలో రజనీకి కథ వినిపించడం.. చేసేయడం జరిగిపోయింది.
Chiru: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజాగా చిత్రం జైలర్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. రజినీకాంత్ స్టార్ డమ్‌ని మరోసారి అభిమానులకు పరిచయం చేసిన సినిమా ఇది కావడం విశేషం. ఈ మూవీ ఆఫర్ ముందు చిరంజీవికే వచ్చిందట. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కథను ముందుగా చిరంజీవికే చెప్పారట. అవును, మీరు చదివింది నిజమే, బీస్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, నెల్సన్ మెగాస్టార్ చిరంజీవిని కలుసుకుని, జైలర్ కథను అతనికి చెప్పాడట. ఆ చిత్రంలో పాటలు, డ్యాన్సులు లేనందున చిరు ఈ మూవీ చేయడానికి కొంత సమయం కావాలని చెప్పారట. ఆ సమయంలో బీస్ట్ సినిమా విడుదలైంది. విజయ్ నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన పనితీరును చూసిన తరువాత, చిరంజీవి తన ఇతర తెలుగు కమిట్మెంట్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జైలర్ విజయం నెల్సన్‌ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది.
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత, నెల్సన్ మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఇద్దరినీ కూడా కలిశాడని చెబుతారు. బీస్ట్ రిజల్ట్ పట్టించుకోకుండా, మెగాస్టార్ ఈ మూవీ అంగీకరించి ఉంటే, సినిమా మరింత బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎందుకంటే, ఈ మూవీని డైరెక్టర్ తీసిన విధానం, రజినీ చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికీ ఈ మూవీ హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరు, ఇప్పుడు తాజాగా జైలర్ లాంటి మూవీని మిస్ చేసుకోవడం బాధాకరమే.