Rs.17K Crores: రూ.2 వేల నోటును ఆర్బీఐ (RBI) విత్ డ్రా చేసుకోవడంతో మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద జనం క్యూ కట్టారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ మార్చేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి మార్చుకోవడం, డిపాజిట్ (deposite) చేసేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. వారం రోజుల్లో రూ.17 కోట్ల విలువైన పెద్ద నోట్లు ఎస్బీఐ వద్దకు వచ్చాయని వివరించింది.
గత వారంలో రూ.17 వేల కోట్ల విలువైన నోట్లు రాగా అందులో రూ.14 వేల కోట్లను (rs.14k crores) కస్టమర్స్ డిపాజిట్ చేశారు. కేవలం రూ.3 వేల కోట్ల విలువ గల నోట్లను మార్చుకున్నారని తెలిపింది. వారం రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో ఉంటే.. సెప్టెంబర్ వరకు భారీగా ఉంటాయని బ్యాంక్ రీసెర్చ్ వింగ్ అంచనా వేసింది. రూ.2 వేల నోటు (rs.2 note) మార్చుకోవడం కన్నా.. డిపాజిట్ చేయడానికే జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 80 శాతం కస్టమర్స్ రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లక్ష కోట్ల కంటే పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ వింగ్ చెబుతోంది.
మార్చి 2107 నుంచి 89 శాతం రూ.2 వేల నోట్లను అందజేశారు. వాటి జీవితకాలం నాలుగైదు ఏళ్లు మాత్రమే.. దీంతో ఆ నోట్లను రీ కాల్ చేశారు. మార్చి 21, 2018 వరకు మార్కెట్లో రూ.6.73 లక్షల కోట్లు పెద్ద నోట్లు చలామణిలో ఉండగా.. మార్చి 31, 2023 నాటికి కేవలం 3.62 రూ.2 వేల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. కేవలం 10.8 శాతం మాత్రమే మార్కెట్లో ఉన్నాయి.