BJP, RSS చేతిలో అన్నీ వ్యవస్థలు, మోడీ దేవుడిని మాయ చేయగలడు: రాహుల్ గాంధీ
బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతిలో దేశంలోని అన్నీ వ్యవస్థలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ ఆ దేవుడిని కూడా మాయ చేస్తారని సెటైర్లు వేశారు.
Rahul Gandhi: దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్నీ వ్యవస్థలను నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అమెరికా (america) పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కాలిఫోర్నియాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఇప్పుడు సభలు, సమావేశాలు ఏ మాత్రం పనిచేయడం లేదని ఆరోపించారు. అన్నీ వ్యవస్థలు బీజేపీ (bjp), ఆర్ఎస్ఎస్ (rss) గుప్పిట్లో ఉన్నాయని విమర్శించారు.
దేవుడిని కూడా మాయ చేస్తారు..
ప్రధాని మోడీ (modi) గురించి రాహుల్ గాంధీ (rahul gandhi) ప్రస్తావించారు. తనకు అంతా తెలుసు అని మోడీ (modi) అనుకుంటారని పేర్కొన్నారు. మోడీని (modi) దేవుడి వద్ద కూర్చోబెట్టారనుకోండి.. ఆ దేవుడికే సృష్టి ఎలా పనిచేస్తుందనే విషయాలను వివరిస్తాడని తెలిపారు. తాను ఏమీ సృష్టించానని ఆ దేవుడే అయోమయంలో పడిపోతాడని చెప్పారు. రాహుల్ (rahul) కామెంట్స్‌తో సభలో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఇదీ మీకు జోక్‌గా అనిపించొచ్చు.. నిజానికి సైంటిస్టులకు సైన్స్, చరిత్రకారులకి చరిత్ర, సైన్యానికి యుద్ధాన్ని, వైమానిక దళానికి ఎగరడాన్ని నేర్పిస్తారని మోడీపై సెటైర్లు వేశారు.
తిరగబెట్టిన మోకాలి నొప్పి
భారత్ జోడో యాత్రలో (Bharath jodo yatra) అనుభవాలను వివరించారు. ఆరు రోజులకు వెయ్యి కిలోమీటర్లు నడవడం సాధ్యం కాదు అనిపించిందని తెలిపారు. మోకాలి గాయం తిరగబెట్టడంతో ఇబ్బందికి గురయ్యానని తెలిపారు. ఆలోచిస్తూనే ముందుకు నడిచానని.. 3 వారాలు రోజుకి 25 కిలోమీటర్లు నడిచానని వివరించారు. ప్రజలను కలిస్తే తన ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. అన్నీ కులాలు, మతాల వారిని కలిశానని చెప్పారు.
నమ్మొద్దు
భారత దేశం గురించి మీడియా (media) చెప్పే అంశాలను పట్టించుకోవద్దని రాహుల్ గాంధీ (Rahul gandhi) సూచించారు. అక్కడ మీడియా బీజేపీకి అనుకూలంగా ఉండేలా వార్తలు ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతిలో మీడియా ఉందని, అన్నీ వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు.