ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor case) ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) పేరు వినిపించింది. మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్ పై విచారణ సాగింది. ఆ టైంలో కవిత పేరు ఈడీ(ED) తరపు న్యాయవాదులు ప్రస్తావించడంతో మరోసారి తెరపైకి ఆమె పేరు వచ్చింది. లిక్కర్ పాలసీ రూపకల్పన స్కామ్‌లో కీలక వ్యక్తి అరుణ్ పిళ్లై అని, ఆయన సౌత్ గ్రూప్‌ను నడిపించారని ఈడీ తమ వాదనలు వినిపించింది.
స్కామ్‌లో కవిత(Kavitha) తరపున అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ(ED) కోర్టుకు చెప్పుకొచ్చింది. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో అనేక ఆస్తులు కొన్నట్లు ఈడీ పేర్కొంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో చాలా మీటింగ్స్ జరిగినట్లు తెలిపింది. ఫినిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, ఆడిటర్ బుచ్చిబాబులు హైదరాబాద్‌లో కొన్ని ప్రాపర్టీలు కొన్నట్లు ఈడీ పేర్కొంది.
మార్కెట్ ధర కంటే తక్కువగా చెల్లించి కవిత(Kavitha) భూములు కొన్నట్లు ఈడీ(ED) న్యాయవాది ఆరోపించారు. లిక్కర్ కేసు(Liquor Case)లో ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చి విచారించామని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే ఈడీ వాదనలు విన్న పిళ్లై తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో ఈ విచారణను కోర్టు జూన్ 2వ తేదికి వాయిదా వేసింది.