Rajinikanth Has Entry To Politics No Use: Satyanarayana Rao
Rajinikanth Brother: తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు (Rajanikanth) ఉండే క్రేజ్ వేరే. రజనీ (Rajani) అంటే తమిళ్ ఫ్యాన్స్ ఊగిపోతారు. తలైవా అంటూ తెగ సందడి చేస్తారు. సినిమాలకు ఎప్పుడో గుడ్ బై చెప్పాల్సి ఉంది. ‘బాబా’ (baba) తన చివరి సినిమా అప్పట్లో రజనీ ప్రకటించారు. అభిమానుల (fans) కోసం నటిస్తూనే ఉన్నారు. ప్రజల్లోకి వచ్చి సేవా చేయాలని.. మక్కల్ మండ్రం పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాలేనని ప్రకటన చేసినప్పటికీ.. తలా పొలిటిక్స్‌లోకి రావాలని కోరేవారు ఉన్నారు.
రజనీ (Rajani) రాజకీయ ప్రవేశం గురించి ఎప్పుడూ చర్చ ఉండనే ఉంటుంది. ఆయన సోదరుడు సత్యనారాయణ రావు (satyanarayana rao) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని తెలిపారు. ఒకవేళ వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. అందుకు కారణం రజనీ వయస్సేనని వివరించారు. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ (Rajanikanth) ఎవరికీ మద్దతు పలికే అవకాశం లేదని చెప్పారు. తన సోదరుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తిరుచెందూరు కుమారస్వామి ఆలయన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రజనీ (Rajani) సోదరుడి కామెంట్స్‌తో రాజకీయాలు అనే మాట ఉండబోదు. అభిమానులు మాత్రం రజనీకాంత్ (Rajanikanth) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. రజనీకాంత్ జైలర్, లాల్ సలాం చిత్రాల్లో నటిస్తున్నారు. లాల్ సలాం మూవీలో గెస్ట్ రోల్లో కనిపిస్తారు. ఈ మూవీని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఆమెకు ఇప్పటివరకు హిట్స్ లేవు. ఐశ్వర్య హీరో ధనుష్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.