»Bjp Sr Leader Vijaya Shanti Political Counter To Minister Harish Rao On Twitter
Vijayashanthi: హరీశ్ రావు వ్యాఖ్యలకు రాములమ్మ కౌంటర్.. మామూలుగా లేదు
బీజేపీ చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దానిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సొంతపార్టీలో మండిపడుతున్న వారు కొందరు అయితే... ఇప్పుడు నేరుగా ట్విట్టర్ లోనే విమర్శలు మొదలయ్యాయి.
Vijayashanthi: బీజేపీ చేరికల కమిటీ( BJP’s recruitment committee) చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్(MLA Etala Rajender) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దానిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సొంతపార్టీలో మండిపడుతున్న వారు కొందరు అయితే… ఇప్పుడు నేరుగా ట్విట్టర్(Twitter)లోనే విమర్శలు మొదలయ్యాయి. ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి(Vijayashanthi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక, జీహెచ్ఎంపీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇది చేరికల కమిటీతో వచ్చిందా లేక ప్రజల విజ్ఞతతో వచ్చిందా అని ట్వీట్ చేశారు. బీజేపీ(BJP)ని గెలిపిస్తున్నది కార్యకర్తల త్యాగం, బీజేపీని నమ్ముకున్న ప్రజల విశ్వాసం, రక్తదానం చేసే హిందూ మత సంఘాల పోరాటాలేనని అన్నారు. చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్లను ప్రస్తావిస్తూ చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు హరీష్ అంటూ వాగ్బాణాలు సంధించారు. విజయశాంతి టార్గెట్ హరీష్ రావు(Harish rao)లా కనిపిస్తున్నప్పటికీ ఆమె మెయిన్ టార్గెట్ ఈటలనే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. చేరికల కమిటీతో ఓట్లు రావని చెప్పకనే చెప్పారు.
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు,
చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ….. pic.twitter.com/G8ulVzUyTf
అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారని గతంలోనే ఈటల వ్యాఖ్యలు చేశారు. వారెవరో చెప్పేందుకు విజయశాంతి నిరాకరించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడది దాటిందనే టాక్ వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమని రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా వారితో జరిగిన చర్చల గురించి వివరించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ లేదు. పొంగులేటి, జూపల్లితో రోజూ మాట్లాడుతాను. నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. భాజపాలో చేరేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు వారిద్దరినీ కాంగ్రెస్లో చేరకుండా ఆపగలిగానని, బీజేపీలోకి మాత్రం తీసుకురాలేకపోయారని ఈటల అన్నారు. దీంతో పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కాంగ్రెస్లో చేరుతారని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.