»Hatavadi Lyrical Video Song Out By Dhanush Miss Shetty Mr Shetty Movie
Hathavidi: ధనుష్ పాడిన “హతవిది” లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
స్వీటీ అనుష్క శెట్టి(anushka shetty) తదుపరి చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr shetty) నుంచి హతవిది(Hathavidi) లిరికల్ వీడియో రిలీజైంది. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా యాక్ట్ చేస్తున్నారు. హీరో బాధను వ్యక్తపరుస్తున్న ఈ లిరికల్ వీడియో ఎలా ఉందో ఓసారి చూసేయండి మరి.
అనుష్క శెట్టి(anushka shetty), నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr shetty) చిత్రం నుంచి హతవిది లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటలో మిస్టర్ పొలిశెట్టి తన బాధాకరమైన స్టోరీని ఈ వీడియోలో చూపించినట్లుగా అనిపిస్తుంది. చిలుక జోష్యం సహా పలు సందర్భాలలో అన్ని కూడా పొలిశెట్టికి వ్యతిరేకంగా జరగడం వీడియోలో చూడవచ్చు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. అయితే ఈ పాటకు సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించగా..రధన్ మ్యూజిక్ డైరెక్షన్లో తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ పాటను పాడారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty)మూవీలో అనుష్క చెఫ్‌గా కనిపించనుంది. ఈ మూవీలో హీరో నవీన్ పోలిశెట్టి ఒక స్టాండ్ అప్ కమెడియన్‌గా నటిస్తున్నాడు. టీజర్ సహా సాంగ్స్ చూస్తుంటే ఈ సారి నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) రికార్డులు క్రియేట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ క్యూట్ జంట చాలా రోజుల తర్వాత తెరపై కనిపించనుంది. రొమ్ కామ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
తమిళ సూపర్ స్టార్ ధనుష్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను ఇటీవల తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘సర్’లో కనిపించి ఓ పాట కూడా పాడారు. అతను ప్రస్తుతం మరో తెలుగు చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం మరోసారి ఆలపించారు.